E-Paper
Advertisement

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!
Advertisement

AP Pensions new rule: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ విధానంలో ఒక చిన్న మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికే వచ్చి పూర్తి పింఛన్ డబ్బులను చేతికి ఇచ్చేవారు. కానీ ఇకపై అలా కాకుండా, పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త నిర్ణయంపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్చ్ సీఈవో వాకాటి కరుణ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

నగదు మంజూరు విధానం ఇలా..

Advertisement

ఇకపై పింఛన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా అని వేర్వేరుగా ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వచ్చే వాటాను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రం ఎప్పటిలాగే సచివాలయ సిబ్బంది ఒకటో తేదీన మీ ఇంటికే వచ్చి చేతికి అందిస్తారు.

వృద్ధులకు వచ్చే రూ.4,000 పింఛనులో రాష్ట్ర వాటా రూ.3,800 చేతికి లభిస్తుంది. మిగిలిన రూ.200 కేంద్ర వాటాగా నేరుగా ఖాతాలో పడుతుంది. అలాగే దివ్యాంగులకు వచ్చే రూ.6,000 లో రాష్ట్ర వాటా రూ.5,700 చేతికి ఇస్తే, కేంద్రం ఇచ్చే రూ.300 బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది.

Advertisement

లబ్ధిదారులు వెంటనే చేయాల్సిన పని

కేంద్రం అందించే ఈ వాటా నిధులు మీ అకౌంట్‌లో పడాలంటే ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు కచ్చితంగా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఈ అనుసంధానం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు జమ కావు. కాబట్టి పింఛన్‌దారులు వెంటనే తమ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఆధార్ సీడింగ్ పూర్తయిందో లేదో సరిచూసుకోవాలి. లింక్ కాకపోతే వెంటనే పూర్తి చేయడం మంచిది.

మార్పు వెనుక అసలు ఉద్దేశం

పింఛన్ల పంపిణీ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. కేంద్ర నిధుల బదిలీలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేదా మధ్యవర్తులు లేకుండా చూసేందుకు ఈ రూల్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పింఛన్ల నిధుల్లో కేంద్రం ఎంత ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తోందనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా.. లబ్ధిదారులు ఈ మార్పు పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ప్రతి నెలా 1వ తేదీనే మీ ఇంటి వద్దకే పింఛన్ అందుతుంది.

Also Read: కల్వకుంట్ల శకం ముగిసింది.. 14 ఏళ్ల వనవాసం తప్పదు! BRS నేతలపై సాయికుమార్ ఫైర్

Tags

Related News

చర్యకు ప్రతిచర్య తప్పదు.. టీడీపీ నేతలు, పోలీసులకు కేతిరెడ్డి వార్నింగ్

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం!

వైసీపీది అంతా రివర్స్ వ్యవహారం.. పట్టణాలే కాదు-పల్లెల్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చారు-సీఎం చంద్రబాబు

మామ వెనక్కి తగ్గు.. అలాంటి మాటలొద్దు, బొత్సకు మేనల్లుడు శ్రీను స్ట్రాంగ్ కౌంటర్..

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎపిసోడ్.. అమరావతి టు ఢిల్లీ, నాకు నచ్చకపోతే అక్కడే రాజీనామా

కేవలం 12 నెలల వ్యవధిలో.. ఆసియాలో అతిపెద్ద బేవరేజ్ ప్లాంట్, ఎక్స్‌లో మంత్రి లోకేష్..

వైసీపీ చ‌నిపోయిన పార్టీ.. బ్రతికున్నామనే భ్రమలో ఆ పార్టీ నేతలు, నాగబాబు హాట్ కామెంట్స్‌పై చర్చ

సీఎం చంద్రబాబుతో భేటీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జెడ్సీ పదవిపై చర్చ, నెక్ట్స్ అడుగులు ఎటువైపు?

Big Stories

Advertisement
×