E-Paper
Advertisement

కల్వకుంట్ల శకం ముగిసింది.. 14 ఏళ్ల వనవాసం తప్పదు! BRS నేతలపై సాయికుమార్ ఫైర్

కల్వకుంట్ల శకం ముగిసింది.. 14 ఏళ్ల వనవాసం తప్పదు! BRS నేతలపై సాయికుమార్ ఫైర్
Advertisement

Mettu Sai Kumar: గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ బిఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పదేపదే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడిన ఆయన, ప్రతిపక్ష నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

BRS- భయంకర రాష్ట్ర సమితి

Advertisement

బిఆర్ఎస్ అంటే సాధారణ రాజకీయ పార్టీ కాదని, అది నిజంగా ‘భయంకర రాష్ట్ర సమితి’ అని సాయికుమార్ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ నేతలకు ఏమాత్రం మానవత్వం ఉన్నా, ఒంట్లో ప్రవహించేది నిజమైన రక్తం అయితే సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేయడం తక్షణమే బంద్ చేయాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేసే చెంచాలు ఎగిరెగిరి దంచినా, వారు విసిరే కూలి మినహా లభించేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

అసత్య ప్రచారాలు చేస్తే తీవ్ర పరిణామాలు

Advertisement

ఏసీ గదుల్లో కూర్చొని కపట అబద్ధాలు ఆడటం, పనికిరాని వ్యాఖ్యలు చేయడం బిఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. నోటికొచ్చినట్లు వంకరటింకరగా మాట్లాడితే, రాబోయే రోజుల్లో ప్రజలు వీపులపై చెప్పులు తెగేలా బుద్ధి చెప్తారని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కల్వకుంట్ల శకం ఇప్పటికే ముగిసిపోయిందని, తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్‌తో ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని చెప్పారు.

14 ఏండ్ల వనవాసం తప్పదు

అధికారం కోల్పోయామనే బాధతో బిఆర్ఎస్ నాశనమైన భవనంలా బూడిద కాబోతోందని, అందుకే ఓర్వలేక సీఎం ఫ్యామిలీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఇకపై ఏ రకమైన విన్యాసాలను, తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్ కుటుంబాన్ని నమ్మరని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ నేతలు కచ్చితంగా మరో 14 సంవత్సరాలు రాజకీయ వనవాసం చేయాల్సిందేనని, రేవంత్ రెడ్డి ఎవరి బెదిరింపులకు భయపడరని తేల్చి చెప్పారు.

Also Read: రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!

Tags

Related News

అక్టోబర్‌లోగా కరువు నివేదిక సిద్ధం చేయండి.. అధికారులకు సీఎస్ ఆదేశం!

బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!

రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!

లక్ష రూపాయల లంచం.. ACB వలలో DMHO స్వర్ణకుమారి!

మద్యం లెక్కలు తీసిన మంత్రి జూపల్లి.. BRS హయాంలో 260% పెరిగితే, మా పాలనలో..!

ఐదు రోజలు ఉండాల్సిందే.. తేల్చి చెప్పేసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

కాంగ్రెస్ గెలిస్తే ఓకే.. ఓడిపోతే EVMల తప్పా? రాహుల్ గాంధీకి బీజేపీ సూటి ప్రశ్నలు!

Big Stories

Advertisement
×