BigTV English
Advertisement

AP Politics: బాలినేని క్యూకి బూచేపల్లి అడ్డు తగిలేనా? జగన్ మార్క్ పాలిటిక్స్ ప్రకాశంలో ఫలించేనా..

AP Politics: బాలినేని క్యూకి బూచేపల్లి అడ్డు తగిలేనా? జగన్ మార్క్ పాలిటిక్స్ ప్రకాశంలో ఫలించేనా..

Prakasam Politics: ఆ జిల్లా వైసీపీకి కంచుకోట. ఆ కంచుకోటనే కూటమి బద్దలు కొట్టింది. అందుకే ఈసారి వైసీపీ పక్కా ప్లాన్ తో ఆ జిల్లాకు కొత్త రధసారధిని అప్పుడే ప్రకటించింది. జిల్లాకు చెందిన కీలక నేత పార్టీ మారగా.. జిల్లాలోని క్యాడర్ ను కాపాడుకొనేందుకు వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతుందని రాజకీయ చర్చ. ఇక్కడే సైలెంట్ గా ఉన్న కూటమి.. నెక్స్ట్ ప్లాన్ ఏంటనే విషయం ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి. ఇంతకు ఇంతలా సైలెంట్ పాలిటిక్స్ నడుస్తున్న ప్రకాశం జిల్లాలో అసలేం జరుగుతోంది ?


ప్రకాశం జిల్లా అంటేనే సైలెంట్ పాలిటిక్స్ కి పేరు. అందుకే ఇక్కడ పాలిటిక్స్ ఎప్పుడు, ఎలా మారతాయో కూడా చెప్పలేము. మొన్నటి వరకు వైసీపీ కి నా అండదండా అంటూ ప్రకటించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఉన్నట్లుండి జనసేనలోకి జంప్ అయ్యారు. ప్రకాశం వైసీపీ పెద్దన్నగా పిలువబడే బాలినేని పార్టీ మార్పుతో.. ఇక ప్రకాశం వైసీపీ ఖాళీ అనే వాదన కూడా వినిపించింది. ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రాగా… అందులో 2 స్థానాలు ప్రకాశం జిల్లాలో ఉండడం విశేషం. అంతా కూటమి హవా ఉన్న సమయంలోనే.. 2 సీట్లు వైసీపీ వశం కావడంతో.. బాలినేని పార్టీ మారినా..  జిల్లాపై పట్టు కోల్పోకూడదన్నది మాజీ సీఎం జగన్ లక్ష్యం.

Also Read: AP Politics: ఏపీలో మండుతున్న రాజకీయం.. టార్గెట్ భూమన?


బాలినేని జనసేన చేరికను కూటమిలో భాగమైన టీడీపీ స్థానిక నేతలు ముందు కొంత వ్యతిరేక పవనాలు వీయించినా.. మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇక్కడే వైసీపీ మార్క్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. దర్శి ఎమ్మెల్యేగా ౠచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయాన్ని అందుకోగా.. ౠచేపల్లిని జిల్లా వైసీపీ అద్యక్ష పదవిలో కూర్చోబెట్టింది వైసీపీ అధిష్టానం. బూచేపల్లి కుటుంబం అంటే జిల్లాలో ప్రజాదరణ గల కుటుంబం. అంతేగాక జగన్ కు ఆత్మీయ బంధువులు. అందుకే జిల్లాలో గల క్యాడర్ మారకుండా.. ముందస్తుగానే బూచేపల్లిని జగన్ జిల్లా అద్యక్షుడిగా ప్రకటించారన్న చర్చ జరుగుతోంది.

అధికారంలో ఉన్న కూటమికి ఎదురొడ్డి పోరాడగల సత్తా బూచేపల్లికి ఉందా.. అలాగే పార్టీ క్యాడర్ ను కాపాడుకోగలరా.. జగన్ నమ్మకాన్ని నిలబెట్టగలరా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది. అయితే కూటమి మాత్రం సైలెంట్ గా వైసీపీ అడుగులను గమనిస్తుండగా.. వైసీపీ మాత్రం తన పని తాను చేసుకొని ముందుకు సాగుతోంది. మొన్నటి వరకు బాలినేని సారథ్యంలో ఉన్న బూచేపల్లి ఇప్పుడు జిల్లా అద్యక్షుడిగా బాలినేనిపై ఎటువంటి గురి పెట్టనున్నారు ? బాలినేని కూడా బూచేపల్లి కి చెక్ పెట్టేందుకు ఎలా ముందడుగు వేస్తారన్నది తేలని ప్రశ్న. తన వెంట క్యూ ఉందన్న బాలినేనికి బూచేపల్లి చెక్ పెడతారా.. క్యాడర్ ను కాపాడుకుంటారా అన్నది మున్ముందు ప్రకాశం పాలిటిక్స్ ముఖచిత్రంలో చూడాల్సి ఉంది.

Related News

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

Big Stories

×