Big Stories

Two Families With Four Parties: F2.. ఆ రెండు ఫ్యామిలీస్‌..

AP Politics Revolve Around Two Families With Four Parties: ఆంధ్రప్రదేశ్‌లో పేరుకి ఎన్ని పార్టీలు ఉన్నా .. పెత్తనమంతా రెండు కుటుంబాలదే నడుస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి. ఏపీ పాలిటిక్స్‌ ఇంత కాలం వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన అన్నట్లు కనిపించాయి.. ఇప్పటికీ ప్రధాన పోటీ ఆ పార్టీల మధ్యే కనిపిస్తున్నా.. కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చి పరిగెత్తే ప్రయత్నం చేస్తోంది. ఇక రాష్ట్రంలో ఉండీ లేనట్లు ఉన్న బీజేపీ ఉనికి చాటుకోవడానికే ఆపసోపాలు పడుతోంది.. ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా అన్ని పార్టీల రాజకీయం రెండు కుటుంబాల చుట్టే తిరుగుతుండటం ఆసక్తి రేపుతోంది.

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో.. రాజీకయమంతా రెండు కుటుంబాల కనుసన్నల్లోనే నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీల మధ్య కనిపిస్తోంది .. టీడీపీకి జనసేనతో పొత్తు కుదరడంతో విజయంపై ధీమాగా ఉంది.. ఇక రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ రేసులో స్పీడీ పెంచే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్కశాతం ఓట్లు కూడా దక్కించుకోలేని బీజేపీ హడావుడి గట్టిగానే కనిపిస్తోంది.

- Advertisement -

ఇప్పుడా రెండు జాతీయ పార్టీలు.. రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం.. బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయమే అని చెప్పాలి. తండ్రి వైఎస్ రాజకీయ వారసుడ్ని తానే అంటూ.. కాంగ్రెస్ హై కమాండ్ ను ధిక్కరించి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్.. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీ తో 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మరోసారి ఏపీ లో పవర్ లోకి రావడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ అవుతున్న పేరు వైఎస్ షర్మిల.. ఏపీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చి.. కాంగ్రెస్‌లో చేరిన రోజుల వ్యవధిలో పీసీసీ అధ్యక్షురాలైన ఆమె.. పగ్గాల చేపట్టి నాటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్‌కి ఊపిరి పోయ్యాలన్నా.. గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యం అన్న కాంగ్రెస్ హై కమాండ్ నమ్మకాన్ని నిజం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు. వైఎస్ కుమార్తెగా వైఎస్ షర్మిలారెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణేలభిస్తోంది.

షర్మిల ఎంట్రీతో ఇప్పటికే ఆమె అన్న జగన్ పార్టీ నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వచ్చి కాంగ్రెస్‌లో చేరారు.. టికెట్ల విషయంలో జగన్ నిర్ణయాలతో అసంత‌ృప్తితో ఉన్న పలువురు వైసీపీ నేతలకు కూడా షర్మిల ఆశాదీపంలా కనిపిస్తున్నారంట .. ఆ క్రమంలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైఎస్ అభిమానులు ఇప్పటికే ఆమెతో టచ్‌లోకి వచ్చారంటున్నారు.

ఇక టీడీపీ.. పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి.. టీడీపీ తిరిగి లెగుస్తుందంటే అది నమ్మకమైన పసుపు సైనికులు, చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు ఎనలిస్ట్ లు.. 70ఏళ్ల పైబడ్డ వయస్సులో ఇప్పటికీ ఆయనపైనే తెలుగు తమ్ముళ్లు నమ్మకాలు పెట్టుకున్నారు … స్కిల్ స్కాం లో రిమాండ్ కు వెళ్లి వచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన సానుభూతి నీ ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఒక పక్క అండగా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు నమ్మకమైన తోడుగా నిలిచారు.

ఏపీలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజీపీ ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించదు. ఏరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగ పడకపోవడంతో.. పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించారు . కాషాయపెద్దలు.. దానికి తగ్గట్టు గానే ఆమె రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజీపీనీ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి.. పెంచుకున్న అనుభవంతో ఆ మాజీ కేంద్రమంత్రి బీజేపీలో జవసత్వాలు నింపడానికి ప్రయత్నిస్తున్నారు.

స్వయానా చంద్రబాబుకు వదిన అయిన పురందేశ్వరి.. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన ల మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే కీలకపాత్ర పోషించనున్నారు. ఏపీలో జనసేన కూడా కీలకంగా ఉన్నా.. ఆల్రెడీ టీడీపీతో పొత్తులోనే ఉంది. మొత్తమ్మీద మునుపెన్నడూ లేని విధంగా ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ అలా నడిచిపోతున్నాయిప్పుడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News