BigTV English

AP Speaker Letter To Rebel MLA’s: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌!

AP Speaker Letter To Rebel MLA’s: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌!
AP Speaker Letter To Rebel MLAs

AP Speaker Letter To Rebel MLA’s: రెబల్ ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణలో ఇప్పటికే ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చివరగా ఈ నెల 19వ తేదీన తుది విచారణ ఉంటుందంటూ స్పీకర్‌ తమ్మినేని రెబల్ ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. అయినా కానీ ఎవరూ హాజరు కాకపోవడంపై.. స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు .


ఈ క్రమంలోనే ఇక విచారణ చేపట్టకుండా.. న్యాయ నిపుణుల సలహాతో వారిపై చర్యలకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల అంశంలో త్వరలోనే స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో అనర్హత పిటిషన్లపై విచారణ పర్వానికి ముగింపు పలికినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు 8 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నుంచి తాజాగా లేఖలు వెళ్లాయని సమాచారం అందుతోంది.

Read More: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..


విచారణకు హాజరు కావాలని అవకాశం ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేదని స్పీకర్ లేఖల్లో వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన చివరి విచారణ ఉంటుందన్నా.. హాజరు కాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇక విచారణ ఉండదని లేఖల్లో సంకేతాలు ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×