BigTV English

AP Govt on PM Modi: మోడీ వెంటే మేము.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్

AP Govt on PM Modi: మోడీ వెంటే మేము.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్

AP Govt on PM Modi: ఏపీలోని విశాఖలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. 2024 ఎన్నికల అనంతరం ప్రధానిగా మోడీ తొలి పర్యటన కావడంతో సీఎం చంద్రబాబు అధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ లకు శంకుస్థాపన చేశారు.


అలాగే వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సైతం సాగించారు. విశాఖలోని సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానం వరకు ప్రధాని రోడ్ షో సాగగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. అడుగడుగునా కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. బలమైన భారతదేశం కోసం పరితపిస్తున్న మహానేత ప్రధాని నరేంద్ర మోడీ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచంలోనే ఆర్థికంగా బలోపేతమైన మూడవ దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన ఘనత కూడ ప్రధానికే దక్కుతుందని పవన్ తెలిపారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారని, అందుకే అధిక మెజారిటీ ఏపీలో వచ్చిందన్నారు. ఏపీలో 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చాయని, 7 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.


ఈ అవకాశం కల్పించిన పీఎం కు చేతులెత్తి నమస్కరిస్తునట్లు పవన్ తెలిపారు. పోలవరం, జల జీవన్ కు నిధులు వచ్చాయంటే, కేంద్రం సహకారం మరువలేనిదన్నారు. మారుమూల గ్రామాల్లో కనీసం రోడ్లు లేవని, ఆ దుస్థితికి కేంద్రం సహకారంతో ఆ రహదారులను అభివృద్ది చేస్తున్నామన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయడమే పీఎం లక్ష్యమన్నారు.

ఐదేళ్లు అంధకారంలో ఉన్నామని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ది అంటే ఆంధ్ర అని చెప్పుకొనేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. దేశ ప్రగతిలో తామందరం భాగస్వామ్యం అవుతామని పవన్ అన్నారు. నమ్మకం పెట్టారు.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయమని పవన్ ప్రసంగించారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని పవన్ ప్రసంగం ముగించారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు అన్ని విధాలా సహకరిస్తున్న నేత పవన్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ నమ్మకానికి మారుపేరని, ప్రధాని వచ్చిన ఈరోజు చరిత్ర సృష్టించిందన్నారు. విశాఖ పట్టణం చిరకాల వాంఛ రైల్వే జోన్ నేడు నెరవేరిందన్నారు. ఫార్మా రంగం అభివృద్దికి నక్కపల్లిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ అభివృద్ది పథం వైపు నడిచేందుకు కేంద్రం ఇస్తున్న సహకారం మరువలేనిదని సీఎం అన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఇన్ని పెట్టుబడులు వచ్చిన కాలం ఎప్పుడూ లేదని, అది కూటమి ప్రభుత్వంతో సాధ్యమైందన్నారు. ప్రపంచం మొత్తం మెచ్చే నాయకుడు మోడీ అంటూ, కొంతమంది ఉత్తరాంధ్ర వైపే మోడీకి మక్కువ ఎక్కువని అంటారని అది అబద్దమన్నారు. ఏపీలో 93 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి విజయ సాధనకు పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిదన్నారు. ఎప్పటికీ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటారని, ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో విజయానికి కారణం ఎవరంటూ చంద్రబాబు అనగానే, ప్రజలు మోడీ.. మోడీ అంటూ గట్టిగా కేకలు వేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన అందిస్తూ దేశాన్ని ముందుకు సాగిస్తున్న ఘనత మోడీకే దక్కుతుందన్నారు. డిజిటల్ ఇండియా, గతిశక్తి, పిఏం కిసాన్ వంటి నిర్ణయాలతో పాటు, పేదలకు సొంతింటి కల నెరవేరుస్తున్న ఘనత కేంద్రానికి దక్కుతుందన్నారు. పీఎం ఫసల్ భీమా పథకాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి అండగా ఉంటున్నారని పీఎం ను కొనియాడారు. ఏడు నెలల్లో సబ్ కా సాథ్.. సబ్ క వికాస్ నినాదంతో దేశం ఆర్థికంగా మూడో స్థానంలో నిలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే దేశం ఆర్థికంగా మొదటి స్థానంలోకి రానుందని చంద్రబాబు అన్నారు.

Also Read: YS Jagan: నెక్స్ట్ గట్టిగా ఇస్తా.. మాజీ సీఎం వైఎస్ జగన్

పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి ఏడు మండలాలు కావాలని అడిగిన వెంటనే మోడీ అందుకు అంగీకరించినట్లు సీఎం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన సహకారంతోనే ఏపీ మళ్లీ పుంజుకుందన్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. అభివృద్ది, సంక్షేమం రెండింటిని కలిపి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామన్నారు. వైజాగ్ ను ఆర్థిక రాజధానిగా ముందుకు సాగిస్తామన్నారు. అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ను పీఎం మోడీ పెంచారని, చంద్రబాబు అనగానే సభ దద్దరిల్లింది. మోడీ తనకు ఆదర్శమని, ఆయన దీవెనలతో అమరావతిని బెస్ట్ సిటీగా మారుస్తామని చంద్రబాబు అన్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×