TGPSC Group 3 key: తెలంగాణ గ్రూప్- 3 అభ్యర్థులకు ఇది ముఖ్యమైన సమాచారం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-3 ప్రిలిమనరీ కీ వచ్చేసింది. గ్రూప్-3 ప్రిలిమనరీ కీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 12వ తేదీలోపు పంపాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
గ్రూప్-3 కీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
గ్రూప్ 3 రాసిన అభ్యర్థులు ముందుగా TSPSC.GOV.IN వెబ్ సైట్ లోకి వెళ్లారు. గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ ఆప్షన్ పై ప్రెస్ చేయండి. అనంతరం మిమ్మల్ని ఐడీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను అడుగుతోంది. వివరాలను ఎంటర్ చేశాక. గెట్ డేటాపై క్లిక్ చేస్తే ప్రాథమిక కీలతో కూడిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఈజీగా కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కీపై అభ్యంతరాలు ఉంటే..
ప్రిలమినరీ కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా జనవరి 12వ తేదీ సాయంత్రం 5లోపు పంపాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. అయితే మెయిల్ ద్వారా పంపే అభ్యంతరాలను స్వీకరించబోమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. వెబ్ సైట్ ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో తగిన ఆధారాలతో పంపిన వాటినే పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.
అభ్యర్థుల్లారా ఇంకెందుకు ఆలస్యం.. గ్రూప్-3 కీ పై ఎలాంటి సందేహాలున్నా… వెబ్ సైట్ ఫార్మాట్ ప్రకారం ప్రూఫ్స్‌తో పంపండి.
Also Read: RRB Group-D Job: రైల్వేలో 32000 ఉద్యోగాలు.. ఇవ్వి చదివితే మీదే ఉద్యోగం..
ఇదిగో కటాఫ్:
గ్రూప్-3 పరీక్షను మొత్తం 450 మార్కులకు గానూ నిర్ణయంచారు. అయితే పేపర్-1 జీఎస్, పేపర్-3 ఎకానమీ పేపర్లు కఠినంగా వచ్చాయి. పేపర్- జీఎస్ 90 నుంచి 100 మార్కులు వస్తే మంచి మార్కులుగా చెప్పవచ్చు. పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ కొంత వరకు ఈజీగానే వచ్చిందని చెప్పవచ్చు. హిస్టరీలొ 50 మార్కులకు గానూ బాగా చదివిన వారు 40 మార్కులు చేయొచ్చు. ఓవరాల్‌గా పేపర్-2లో 100 నుంచి 110 మార్కులు వస్తే మంచి మార్కులుగా చెప్పవచ్చు. ఇక పేపర్-3 ఎకానమీ పేపర్లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. 2021-22, 2022-23 సర్వేల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడంతో చాలా మంది అభ్యర్థులు ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపోయరు. ఇందులో బాగా స్కోర్ చేసినవారికి ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎకానమీ 80 నుంచి 90 మార్కులు వస్తే గుడ్ స్కోర్‌గా చెప్పవచ్చు. 270 మార్కులు దాటితే మంచి మార్కులుగా చెప్పవచ్చు.
ఓవరాల్‌గా..
పేపర్-1: 90 – 100 మార్కులు
పేపర్-2: 100 – 110 మార్కులు
పేపర్-3: 80- 90 మార్కులు
మొత్తంగా మూడు పేపర్లలో కలిపి గ్రూప్-3 పరీక్షలో 270 మార్కుల వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. 280 మార్కులు దాటిన వారికి ఉద్యోగం రావడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంది.
NOTE: గ్రూప్-2 కీ కూడా రెండు రోజుల్లో రానున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.