Malladi Vassishta : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మల్లాడి వశిష్ఠ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఈయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. భారీ అంచాలతో మూవీ సమ్మర్ కు రిలీజ్ కాబోతుంది. నేడు ఈ డైరెక్టర్ పుట్టినరోజు.. ఈ సందర్బంగా ఈయన గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు చిత్ర దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వేణు. బన్నీ, భగీరథ, ఢీ వంటి చిత్రాలు నిర్మించిన సత్యనారాయణ రెడ్డి కుమారుడైన వశిష్టకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే హీరోగా ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆయనకు మంచి అనుభూతులు మిగిల్చింది. అయినా సరే నటుడిగా కొనసాగే ఉద్దేశం లేకపోవడంతో ఆయన డైరెక్షన్ వైపు యూటర్న్ తీసుకున్నారు.. అయితే మొదటి సినిమా చేసిన తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపించకపోవడం తో సినీ పరిశ్రమకు దూరం అయిపోయారేమో అనుకున్నారు అంతా. కానీ సినీ పరిశ్రమ మీద విపరీతమైన మక్కువ పెంచుకున్న వశిష్ట అందుకు భిన్నంగా దర్శకుడిగా కొంతకాలం ప్రయోగాలు చేసి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పెట్టి ‘బింబిసార’ అనే కథ సిద్ధం చేసుకున్నారు. చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. ఒక్కసారిగా ఆ సినిమాతో సినీ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశారు..
ఆ తర్వాత ఈ డైరెక్టర్ ఏ హీరో తో ఈయన సినిమా చేస్తాడా అని అందరు అనుకున్నారు. రెండో సినిమానే మెగాస్టార్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోని అప్రోచ్ అవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఏకంగా రెండో సినిమాని మెగాస్టార్ తో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు వశిష్ట. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సినిమా మొదలుపెట్టి ఒక సోషియో ఫాంటసీ థ్రిల్లర్గా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేశాడు. ముందుకు సంక్రాంతికి రావాలని అనుకున్నా కొన్ని కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే విశ్వంభర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వశిష్ట. సమ్మర్ లో సినిమా రిలీజ్ కాబోతుంది బింబిసార సినిమాతోనే టాలీవుడ్ లో తనదైన మార్క్ వేసుకున్న ఆయన రెండో సినిమాతో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. ఇదిలా ఉండగా.. కళ్యాణ్ రామ్ తో మరో సినిమా చెయ్యనున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. బింబిసార 2 రాబోతుంది. ఈ మూవీ గురించి త్వరలో ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం ఇండస్ట్రీలో టాక్.. ఇకపోతే ఇటీవలె తండ్రిగా ప్రమోషన్ పొందిన వశిష్ట విశ్వంభర తర్వాత మరో స్టార్ హీరోతో ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నారు. ఈ డైరెక్టర్ ఇలాంటి సక్సెస్ చిత్రాలను మరెన్నో తీయాలని కోరుకుంటున్నాం.. హాపీ బర్త్డే అండ్ ఆల్ ది బెస్ట్ వశిష్ట..