BigTV English

APPSC: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీ

APPSC: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీ

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో గత కొన్ని వారాలుగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే.


అయితే తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత వయసు, జీతం పూర్తి వివరాలు https://psc.ap.gov.inలో చూడవచ్చు.


సబ్జెక్టుల వారీగా ఖాళీలు:


  1. బోటనీ- 19
  2. కెమిస్ట్రీ- 26
  3. కామర్స్‌- 35
  4. కంప్యూటర్ అప్లికేషన్స్- 26
  5. కంప్యూటర్ సైన్స్- 31
  6. ఎకనామిక్స్‌- 16
  7. హిస్టరీ- 19
  8. మ్యాథమెటిక్స్‌- 17
  9. ఫిజిక్స్‌- 11
  10. పొలిటికల్ సైన్స్‌- 21
  11. జువాలజీ- 19

మొత్తం 240 ఖాళీలున్నాయి.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష: ఏప్రిల్/ మే, 2024.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 47, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 99 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×