BigTV English

Danger Tree: ఈ చెట్టు మీ పరిసర ప్రాంతాలలో ఉందా.. మీ ప్రాణాలు రిస్క్‌లో ఉన్నట్టే..!

Danger Tree: మానువుని జీవితం చెట్ల మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే చెట్లు లేకపోతే ఆక్సీజన్ లభించదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎటు చూసినా వాయి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ముఖ్య కారణం డెవలప్‌మెంట్ పేరిట చెట్లను ఇష్టానుసారంగా నరికివేయడం.

Danger Tree: ఈ చెట్టు మీ పరిసర ప్రాంతాలలో ఉందా..  మీ ప్రాణాలు రిస్క్‌లో ఉన్నట్టే..!

Danger Tree: మానువుని జీవితం చెట్ల మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే చెట్లు లేకపోతే ఆక్సీజన్ లభించదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎటు చూసినా వాయి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ముఖ్య కారణం డెవలప్‌మెంట్ పేరిట చెట్లను ఇష్టానుసారంగా నరికివేయడం.


అందుకే పూర్వం పెద్దలు ‘వృక్షో రక్షిత రక్షితః’ అనే వారు. చెట్లను మనం రక్షిస్తే.. చెట్లు మనల్ని రక్షిస్తాయని దాని అర్థం. చాలా గ్రామాల్లో ఇప్పటికీ చెట్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలాంటిది ఇప్పుడు ఒక చెట్టును చూసి విశాఖ వాసులు భయంతో వణికిపోతున్నారు. ఆ చెట్టు నుంచి వీచే గాలి అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ చెట్టును చూసి అంతలా ప్రజలు భయపడటానికి కారణం ఏంటో తెలుసా..?

చెట్టు కనిపిస్తే దాని కింద ఓ కుర్చీ వేసుకొని హాయిగా కూర్చొవాలని అనిపిస్తుంది. లేదా ఆ చెట్టుకి కాసే పూలు వెదజల్లే సువాసనలకు ఓ కునుకు వేయాలనిపిస్తుంది. కానీ విశాఖ పట్టణంలో మాత్రం ఆ చెట్ల పూలను చూడటానికి, వాసన పీల్చడానికి నగర వాసులు భయంతో గజగజ వణికిపోతున్నారు. హుద్‌హద్ తుఫాన్ ప్రభావంతో విశాఖలోని పచ్చదనం అంతా కొట్టుకుపోయింది. దీంతో పచ్చదనం కోసం నాటిన చెట్లు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉడా అధికారులు విశాఖ నగరంలోని రహదారుల్లో ఏడాకుల చెట్లను రోడ్డుకు ఇరువైపుల విస్తారంగా నాటారు. ఆల్ స్టోనియా స్కోలరీస్ (Alstonia Scholaries) అనే శాస్త్రీయనామం గల ఈ చెట్లు తక్కువ సమయంలో ఏపుగా పెరిగి నీడని ఇస్తాయన్న ఉద్దేశంతో నాటారు.


అడవుల్లో అధికంగా కనిపించే ఈ చెట్లను గిరిజనలు వాటిని దెయ్యం చెట్లు అని పిలుస్తారు. ఈ చెట్లే ఇప్పుడు ఉడా అధికారులకు తలనొప్పిగా మారాయి. విశాఖ రోడ్లపై ఏపుగా పెరిగిన చెట్ల పువ్వుల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు మానవాళికి అత్యంత ప్రమాదమని స్థానికులు అంటున్నారు. ఈ చెట్లు నీళ్లు లేకున్నా వేగంగా పెరుగుతాయి. గుండ్రంగా ముదురు ఆకుపచ్చగా గుచ్చంలా ఉంటాయి. ఒక్కో గుచ్చానికి ఏడు ఆకులు ఉంటాయి. వీటిని గిల్లితే పాలు కారుతాయి. అందుకే ఈ చెట్టును ఏడాకులు పాల చెట్టు అంటారు. చలికాలంలో ఈ చెట్లు కొమ్మలకు ఉన్న పుష్పాలు ఒకేసారి పుష్పిస్తాయి. దీన్నే దా మాస్ బ్లూమింగ్ అంటారు. ఒక చెట్టు కొమ్మలో వెయ్యి పూలు ఉంటే.. అన్నీ ఒకేసారి విరబూస్తాయి. ప్రతి పూవు నుంచి ఆస్మోఫోర్స్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది.

ఈ కెమికల్ వాసన పీల్చితే.. అస్తమా, అలర్జీ, శ్యాస కోస వ్యాధులు వస్తాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ చెట్టు నుంచి వీచే గాలి పిల్చితే శ్వాస ఇబ్బందిగా మారి స్పృహ కోల్పోవడం.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోవడం జరుగుతుందన్నారు. అయితే వైద్యులు, పర్యావరణ శాస్త్ర వేత్తలు మాత్రం దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

అధికారులు తక్షణమే స్పందించి ఈ చెట్లను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వృక్ష నిపుణులు మాత్రం ఈ చెట్ల కలప నుంచి బ్లాక్ బోర్డులు, అగ్గి పుల్లల తయారు చేయొచ్చని అంటున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని హైవేలో నాటొచ్చని చెబుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×