ఇంతకీ గోవిందమ్మపై దాడి ఎందుకు జరిగింది? ఆ గ్రామానికి .. గోవిందమ్మకు ఉన్న లింకేంటి? బాధితురాలి పేరు దళిత గోవిందమ్మ. ఆమెది అదే కల్లుకుంట గ్రామం. ఆరునెలల క్రితం ఆ గ్రామం నుంచి గోవిందమ్మ కుటుంబాన్ని వెలివేశారు. గ్రామ పెద్దలంతా కలిసి వారిని బహిష్కరించారు. అందుకు కారణం తన కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడమే. గోవిందమ్మ కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ఆరునెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన అమ్మాయి తరపు వాళ్లు పంచాయితీ పెట్టించారు. అప్పుడు ఆ గ్రామ పెద్దలు గోవిందమ్మ కుటుంబాన్ని ఊరు నుంచి వెళ్లిపోవాలని.. ఎప్పుడు ఇటువైపు రావొద్దని ఆదేశించారు.
Also Read: జ్యూస్ లో యూరిన్ కలిపిన అమీర్ ఖాన్.. చితకబాదిన స్థానికులు.. వీడియో వైరల్
దాంతో గోవిందమ్మ ఊరును ఖాళీ చేసి వెళ్లింది. కానీ ఏదో పని మీద మళ్లీ కల్లుకుంట గ్రామానికి రావాల్సి వచ్చింది. అలా రావడం చూసిన ఆ అమ్మాయి తరపు బంధువులు గోవిందమ్మను కరెంటు స్థంభానికి కట్టేశారు. మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేయాలని ట్రై చేశారు. వినకపోవడంతో ఆమెను గంటపాటు టార్చర్ చేశారు. గోవిందమ్మపై దాడి విషయం తెలుసుకున్న గ్రామంలోని దళితులు.. ఇతర సామాజికవర్గాల వారిపై రివర్స్ ఎటాక్ చేశారు. దాంతో సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టి గోవిందమ్మను విడిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
కులం.. కులం.. కులం మనిషి ఇతర గ్రహాలపై అడుగుపెడుతున్నాడు. మనం మాత్రం కులం చుట్టే తిరుగుతున్నాం. 2024 సంవత్సరంలోనూ ఇదే ముఖ్యమంటున్నాం. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచదేశాలు అభివృద్ధివైపు పరుగులు తీస్తుంటే మనం మాత్రం నీది ఏ కులం అని అడుగుతున్నాం. ఇంకెంత కాలం ఈ కులపిచ్చి. కులం ఏమైనా కూడుపెడుతుందా. ఇవన్నీ కూడా పంచ్ లైన్స్. కానీ ఇవేమి కూడా సమసమాజ నిర్మాణానికి దోహదపడలేకపోతున్నాయి. ఇన్నాళ్లూ దాడుల వరకు ఉన్న కులపిచ్చి ఇప్పుడు మరింత వైలంట్‌గా మారింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీన్ని ఆదిలోనే అంతం చేయకపోతే ఇదే సంస్కృతి అంతటికి పాకే ప్రమాదం లేకపోలేదు.