BigTV English

Attack On Chandragiri MLA Candidate: తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి.. ఎస్పీ సీరియస్

Attack On Chandragiri MLA Candidate: తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి.. ఎస్పీ సీరియస్

Attack On Chandragiri MLA Candidate Pulivarthi Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగడం లేదు. చంద్రగిరి ఎన్డీయే కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.


తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన నాని తిరిగివస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో కూటమి అభ్యర్థి భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా అతని కారు ధ్వంసమైంది. నాని భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ  ఘటనపై సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పద్మావతీ మహిళా వర్శిటీ దగ్గరకు చేరుకున్నాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో యూనివర్శిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అటు పోలీసులు కార్లపై కూడా దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వెంటనే పులివర్తి నాని, ఆయన భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనపై తిరుపతి ఎస్పీ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడ్డ వారు ఎవరైనా వదిలేది లేదని హెచ్చరించార. ఆస్పత్రిలో ఉన్న పులివర్తి నానిని పరామర్శించారు తిరుపతి ఎస్పీ. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటగా ఉందని తెలిపారు. స్ట్రాంగ్ రూం సేఫ్ గా ఉందని అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ ఘటనపై నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపిందన్నారు.

Related News

Tirupati crime: బిడ్డ భారమనుకున్న తల్లి.. మురికి కాలువలో విసిరేసింది!

Leopard attack: చిరుత పులి వచ్చింది.. కోడిని వేటాడి వెళ్లింది.. ఏపీలో ఘటన!

AP Liquor Scam: మిథున్ రెడ్డికి బెయిల్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Jagan To Assembly: అసెంబ్లీకి వద్దులే.. సింపతీ వస్తే చాలులే

Turakapalem Deaths: ఆ గ్రామ ప్రజలు వంట చేసుకోవద్దు.. ఆదేశాలు జారీ చేసిన సీఎం

AP Social Media Posts: మనుషులా..? పశువులా..? రోస్టింగ్ పేరుతో రోత.. సైకో చేష్టల కోత్త చట్టం..!

Big Stories

×