BigTV English

Jagga Reddy: కాంగ్రెస్ లోకి బీజేపీ ఎమ్మెల్యేలు..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jagga Reddy: కాంగ్రెస్ లోకి బీజేపీ ఎమ్మెల్యేలు..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jagga Reddy comments on BJP(Telangana politics): కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని అన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మంగళ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.


ఈ సందర్భంగానే బీజేపీ నేత లక్ష్మణ్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్ష్మణ్ తమ పార్టీ నేతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తార్న దానిపై కొందరు జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది కలిగించకుండా తమ పార్టీ వ్యవహరిస్తుందని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇతర పార్టీలను ఇబ్బందులకు గురిచేశాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఈ సారి కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను పార్టీ నెరవేరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్ఫష్టం చేశారు.


Also Read: కవితకు భారీ షాక్.. ఏమైందంటే..?

బీజేపీ దేశ యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని అన్నారు. రూ. 15 లక్షలు పేద వాడి అకౌంట్ లో వేస్తా అన్నారు..ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఏ డోకా లేకుండా పని చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ విలీనం అంటున్నారు.. కేసీఆర్ కు అంత అవసరం ఏం వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి  ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితే ఎలాంటి డోకా ఉండదన్నారు.

 

Tags

Related News

Traffic Challan: బైక్ మీద ట్రిపుల్ రైడ్.. ఫైన్ వేశారని హైదరాబాద్ పోలీసులపై కోర్టుకెక్కిన బైకర్

Kavitha: కవిత ట్విట్టర్‌లో ఆ పేరు డిలీట్.. ఇప్పుడు కొత్తగా ఏం మార్పులు చేసిందంటే..?

Ganesh Laddu: మై హోమ్ భుజాలో రికార్డ్ ధర పలికిన లడ్డూ.. ఏకంగా అరకోటికి పైగానే

CM Revanth Reddy: యూరియా కొరతపై అసలు నిజాలు చెప్పేసిన సీఎం రేవంత్.. రాష్ట్రంలో జరిగేదంతా ఇదే..

Warangal mysteries: వరంగల్‌లో జరుగుతున్న వింతలేంటి? విని ఆశ్చర్యపోవాల్సిందే!

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపు సూళ్లు బంద్!

Big Stories

×