BigTV English

Ayyanna Patrudu : షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి..

Ayyanna patrudu : భూములను కబ్జా చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ ను ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Ayyanna Patrudu : షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి..

Ayyanna patrudu : భూములను కబ్జా చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ ను ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.


వైసీపీ నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారని అయన్న పాత్రుడు ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని సభ పెట్టారు? ప్రశ్నించారు. విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను ఏమైనా మిగిల్చారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలి? ప్రశ్నించారు. భూములు దోచుకున్న వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రశస్తే లేదని హెచ్చరించారు. మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామన్నారు. ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌, అమెరికాలో దాక్కున్నా లాక్కొచ్చి.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు.

జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా లేదని అయన్న పాత్రుడు అన్నారు. జగన్ షర్మిలను అంతమొందించినా ఆశ్చర్య పడక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు. అది జగన్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు.


తనకు ప్రాణహాని ఉందని, రివాల్వర్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేశానని అయ్యన్న పాత్రుడు తెలిపారు. గన్‌మెన్‌ను ఇస్తానని ఎస్పీ అంటే తనే వద్దనేశానన్నారు. ఎక్కడ ఉన్నానో గన్‌మెన్‌లే సమాచారం ఇస్తారని వద్దని చెప్పానని తెలిపారు. అనకాపల్లి ఎంపీ స్థానానికి తన కుమారుడు దరఖాస్తు చేశారన్నారు. ఆ అంశం అధిష్ఠానం పరిశీలిస్తోందని తెలిపారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×