BigTV English

Balakrishna campaign: సీమ నుంచి బాలయ్య.. ప్రత్యర్థులపై పేలనున్న డైలాగ్స్

Balakrishna campaign: సీమ నుంచి బాలయ్య..  ప్రత్యర్థులపై పేలనున్న డైలాగ్స్

Balakrishna campaign: ఏపీలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు సభలు, సమావేశాలతో దూసుకుపోతున్నాయి. ఆయా పార్టీల కంటే టీడీపీ దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు భువనేశ్వరి, ఇంకోవైపు లోకేష్ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వంతైంది.


శనివారం నుంచి ఏపీ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర సాకార యాత్రను బాలకృష్ణ మొదలుపెట్టనున్నారు. రాయలసీమ నుంచి యాత్ర మొదలుకానుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నుంచి మొదలు కానుంది. అక్కడ లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు బాలయ్య. అనంతరం కదిరి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఆలయం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. సాయంత్రం కదిరి కాలేజీ గ్రౌండులో బహిరంభసభ జరగనుంది. అక్కడి నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రచారం కోసం ప్రత్యేకంగా బాలయ్య అన్‌స్టాపబుల్ పేరుతో స్పెషల్‌గా బస్సు రెడీ చేశారు.

ఎన్డీయే అభ్యర్థుల తరపున తొలుత సీమలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో హిందూపురం అసెంబ్లీ స్థానానికి 19న నామినేషన్ వేయనున్నారు. రాయలసీమ తర్వాత నేరుగా ఉత్తరాంధ్రలో జరగనుంది. బాలయ్యబాబు టూర్‌ను కూటమి అభ్యర్థులకు ఏ రోజుకారోజు పర్యవేక్షణ చేయనున్నారు. ఈసారి ఎన్నికల్లో బాలయ్యబాబు మార్క్ కనిపించనున్నట్లు అభిమానులు చెబుతున్నారు. ఆయన డైలాగ్స్‌తో ఫ్యాన్స్ పార్టీకి చుక్కలు కనిపించడం ఖాయంగా చెబుతున్నారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×