BigTV English

Kavitha Delhi Liquor Case Updates: కవిత కథ పెద్దదే?.. సీబీఐ కస్టడీ రిపోర్ట్ లో కొత్త విషయాలేంటి?

Kavitha Delhi Liquor Case Updates: కవిత కథ పెద్దదే?.. సీబీఐ కస్టడీ రిపోర్ట్ లో కొత్త విషయాలేంటి?

Kavitha delhi liquor scam latest news(Political news in telangana): కల్వకుంట్ల కవితకు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. మనం రోజూ డిస్కస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ కేసులో తవ్వుతున్న కొద్ది అనేక కొత్త విషయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. మనల్ని షాక్‌కు గురిచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. సీబీఐ కస్టడీ కోసం వేసిన పిటిషన్‌లో సంచలన విషయాలను చెప్పింది. ఇప్పటి వరకు వంద కోట్ల ముడుపులు తీసుకున్నారన్న విషయాలను ఈడీ కన్‌ఫామ్ చేసింది. కానీ సీబీఐ మరో ముందడుగు వేసింది. మరిన్ని వివరాలను కోర్టు ముందు ఉంచింది.


మాట్లాడితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు.. ఇది కాలపరీక్షకు నిలబడని కేసు. ఇప్పుడీ రిమాండ్ ఓ షాక్‌ ఇచ్చేదనే చెప్పాలి. ఎందుకంటే ముడుపుల కింద ఇచ్చిన, అందిన డబ్బు ఎలా వెళ్లిందనేది క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లేన్ చేసింది సీబీఐ. తాము డబ్బును హవాలా రూపంలో డబ్బు తరలించారని కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ సీబీఐకి చెప్పేశారు. అభిషేక్ బోయినపల్లి సూచనతో డబ్బు తరలించారని తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ డబ్బును గోవాకు తరలించినట్టు కూడా తేలిపోయింది. ఆ ఏడాది గోవాలో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ తరపున చారియట్ మిడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేసింది. ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లను చేయడం దీని పని. అభిషేక్‌ బోయినపల్లి 30 కోట్లు ఆ కంపెనీకి పంపినట్టు నిందితులు తెలిపారు. ఇప్పటికే సీబీఐ కూడా 11.94 కోట్ల రూపాయలు వారికి హవాలా రూపంలో అందినట్టు కన్‌ఫామ్ చేసుకుంది.

ఇక ఈ కేసులో మరో ఇంపార్టెంట్ వ్యక్తి బుచ్చిబాబు. ఇయన కవితకు సీఏగా ఉన్నారు.. ఇయన చాట్స్‌ ద్వారా తెలిసేదేంటంటే. ఇండో స్పిరిట్‌లో కవిత భాగస్వామి అనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయి. కవిత బినామీగా అరుణ్‌ పిళ్లై.. మరో పార్టనర్‌ మాగుంట రాఘవ, సమీర్ కూడా ఇదే విషయాన్ని కన్‌ఫామ్ చేసేశారు. ఈ స్కామ్‌ను ఎంత పకడ్బంధీగా ఇంప్లిమెంట్ చేశారనే విషయంపై సీబీఐ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి పాలసీ ప్రకారం రిటైల్ జోన్‌లో రెండు జోన్లకు మాత్రమే అవకాశం ఉంది. కానీ ఐదు జోన్లు అరబిందో ఫార్మా గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డికి దక్కాయి. పేరుకు మూడు కంపెనీలకు జోన్లు దక్కగా.. ఆ మూడు కంపెనీల డైరెక్టర్‌ శరత్ చంద్రారెడ్డే కావడం విశేషం. దీని వెనక కూడా కవిత కీ రోల్ ప్లే చేసినట్టు చెబుతోంది సీబీఐ.


Also Read: స్వ(వి)పక్షం.. వైసీపీలో రగులుతున్న మంటలు

కవిత, శరత్‌ చంద్రారెడ్డి మధ్య డీల్ కుదిరింది. ఇలా ఆయనకు లాభం చేకూర్చినందుకు 14 కోట్లు ముట్టాయి కవితకు .అయితే డబ్బులను ఎలా ఇవ్వాలి? ఇక్కడే మళ్లీ కవిత లాబీ గ్రూప్‌ తెలివైన పని చేసింది. మహబూబ్‌నగర్‌లో అరబిందో గ్రూప్‌ కవితకు చెందిన ఓ ల్యాండ్‌ను కొనుగోలు చేసింది. నిజం చెప్పాలంటే కవిత కొనాల్సిందే అని డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అరబిందో రియాల్టీ అండ్ మహీరా వెంచర్స్ పేరుతో ఈ భూమిని కొనుగోలు చేశారు. ఎప్పుడైతే శరత్ చంద్రారెడ్డికి ఐదు జోన్లు కేటాయించారో అంటే. 2021, జులై 20న.. అదే నెలలో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద 7 కోట్లు ఇచ్చారు.

ఇక అదే ఏడాది నవంబర్‌లో రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద మరో 7 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. మరి ల్యాండ్‌ చేతులు మారాలి కదా.. కానీ అసలు అలాంటి ఊసే లేదు. సో ఇది ల్యాండ్ పేరుతో జరిగిన ముడుపులు ముట్టచెప్పడం అని అర్థమవుతోంది. యాక్చువల్‌గా పాలసీ కోసం ఆప్ నేతలకు 100 కోట్లు ఇచ్చారు కవిత సో ఇప్పటికే వంద కోట్లు ఖర్చు చేశాను.. కాబట్టి ఐదు జోన్లలో బిజినెస్ దక్కేలా చేశాను కాబట్టి..
ఒక్కో జోన్‌కు 5 కోట్లు చొప్పున 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. ఈ డబ్బును తన మనుషులైన అరుణ్‌ పిళ్లై, అభిషేక్ బోయినపల్లికి ఇవ్వాలని.. కేజ్రీవాల్‌ మనిషైన విజయ్ నాయర్ ఈ విషయాలను కోఆర్డినేట్ చేస్తాడని చెప్పినట్టు సీబీఐ గుర్తించింది.

ఢిల్లీలో లిక్కర్‌ బిజినెస్‌లో అవకాశం దక్కుతుందనగానే.. శరత్ చంద్రారెడ్డి కూడా కార్పొరేట్‌ సోషల్ రెస్పాన్సిబులిటి కింద 80 లక్షల రూపాయలను తెలంగాణ జాగృతికి అందించారు. ఇది కూడా 2021 మార్చిలో జరిగింది.. అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ పేరుతో జాగృతికి ఈ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే 2022 ఆగస్టు 31న ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దైంది. దీంతో తన రిటైల్ జోన్స్‌కు ఇండో స్పిరిట్ నుంచి రావాల్సిన 60 కోట్లు ఇవ్వొద్దని కూడా పిళ్ళై కి కవిత చెప్పారని శరత్ చంద్రారెడ్డి సీబీఐకు చెప్పారు. ఈ విషయాలన్నీ శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్స్‌మెంట్స్‌లోని కీలక అంశాలు.

ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే ఈ కేసులో కవితే కింగ్‌పిన్ అని చెబుతోంది సీబీఐ..అందుకే కవితను మరిన్ని విషయాలపై విచారించాల్సి ఉంది కాబట్టి కస్టడీకి ఇవ్వమని కోరింది సీబీఐ..దీంతో కవితను మూడు రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు.. ఓవరాల్‌గా సీబీఐ చెబుతుందేంటి అంటే.. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేయడాని కారణం.. కవిత.. 100 కోట్ల ముడుపులు సేకరించి ఆప్ నేతలకు ఇవ్వడానికి కారణం.. కవిత.. మొత్తం అన్ని విషయాలను సమన్వయం చేసినవారు. కవిత.. శరత్‌ చంద్రారెడ్డిని బెదిరించినది. కవిత.. అలా బెదిరించి 14 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసేలా చేసింది. కవిత.. ఇవన్నీ కవిత నోరు విప్పకముందు తెలిసిన విషయాలు. కవిత నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×