Chandrababu-Devansh: అన్ స్టాపబుల్ సీజన్- 4 ఫస్ట్ ఎపిసోడ్‌కు సీఎం చంద్రబాబు గెస్ట్‌గా వచ్చారు. గడిచిన ఐదేళ్లు రాజకీయ జీవితంలో వచ్చిన మార్పులేంటి? ఫ్యామిలీ సభ్యులు ఎలా ఇబ్బందిపడ్డారు? మనవడు దేవాంశ్ గురించి కీలక విషయాలు రివీల్ అయ్యాయి.
బాలకృష్ణ హోస్ట్‌గా అన్ స్టాపబుల్ సీజన్-4 మొదలయ్యింది. శుక్రవారం ప్రారంభమైన ఈ షో లో, మొదటి అతిథిగా ఏపీ చంద్రబాబునాయుడు హాజరయ్యారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఓసారి హాజరయ్యా రాయన. ముఖ్యమంత్రి హోదాలో ఇదే ఫస్ట్ షో.
షో సీరియస్‌గా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా మనవడు దేవాంశ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో తాత సీఎం చంద్రబాబును పలు ప్రశ్నలు వేశాడు. రాజకీయాల్లో బిజీగా ఉంటారని, తీరిక సమయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించాడు.
నువ్వు సమయం ఇస్తే నీతో ఆడుకుంటూ రిలాక్స్ అయ్యేవాడినని, అందుకు నువ్వు టైం ఇవ్వట్లేదు కదా అన్నారు. లెక్కలతో కుస్తీ పడుతుంటావని, బోర్ కొడితే సైన్స్ చదువుతూ రిలాక్స్ అవుతావని అన్నారు. నాక్కూడా పని మార్చుకుంటే రిలాక్స్ అవుతానని బదులిచ్చారు.
ALSO READ: అన్నపెదరాయుడు అయితే.. చెల్లి బాలయ్య సినిమాలో భానుమతి: కేతి రెడ్డి
పొడుపు కథపై తాతను ఓ ప్రశ్న వేశాడు దేవాంశ్. ఎప్పుడూ ముందే ఉంటుంది… కానీ, కనిపించదు. అదేంటని అడిగాడు. భవిష్యత్తు అని సీఎం చంద్రబాబు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.
ఈసారి దేవాంశ్ ఇంకాస్త లోతుగా వెళ్లి ఇద్దరి తాతయ్యలకు ఒక ప్రశ్న వేశాడు. చిన్నప్పుడు మీరు చేసిన మోస్ట్ అల్లరి పనేంటని ప్రశ్న వేశాడు. దానికి సీఎం చంద్రబాబు తప్పించుకున్నారు. దీనిపై తాత బాలకృష్ణ తనదైన వ్యాఖ్యానించారు.
దేవాంశ్ అడుగుతున్న ప్రశ్నలు చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయ నేత అవుతాడేమోనని నా డౌట్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక వంటలపై ప్రశ్నల విషయానికొద్దాం. తాను పప్పు బ్రహ్మాండంగా చేస్తానని, ఆమ్లెట్ వేస్తానంటూ చంద్రబాబు తెలిపారు.
టీ, కాఫీల్లో ఏదీ ఇష్టమన్న ప్రశ్నకు వెరైటీగా రిప్లై ఇచ్చారు అతిథి. ప్రతి రోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్య కాఫీ తాగునని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు భువనేశ్వరితో కలిసి తాగుతానన్నారు. అమరావతిలో ఉంటే నాకు డైనింగ్ టేబులే తోడవుతుందన్నారు.