Balineni Srinivas Reddy quits YSRCP: వైసీపీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా కూడా మరోసారి భారీ షాక్ తగిలింది. పార్టీలో కీలకంగా ఉన్న ఓ నేత రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్ కు పంపించారు.
ఒంగోలుకు చెందిన వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన చేశారు. జగన్ కు ఆయన తాజాగా ఓ లేఖను పంపించారు. వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో బాలినేని పేర్కొన్నారు. దీంతో వైఎస్ జగన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.
Also Read: ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేసి బుడమేరును కాపాడాలి: సీపీఐ నారాయణ
కాగా, బాలినేని.. ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ ప్రభుత్వంలో ఈయన మంత్రిగా కూడా పనిచేశారు.
గత కొంతకాలంకా వైవీ సుబ్బారెడ్డితో పలు విబేధాల కారణంగా ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు తాను మంత్రిగా రెండున్నర ఏళ్ల పాటు పనిచేసిన తరువాత ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కూడా బాలినేని జగన్ పై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు పలు అంశాల దృష్ట్యా కొద్దిరోజుల నుంచి అధిష్టానంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి బాలినేని రాజీనామా చేశారంటూ పలువురు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. జగన్ కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరి బంధువు అవుతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీపై ఆయన రాజీనామా ప్రభావం ఎంతోకొంత పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే, బాలినేని జనసేన పార్టీలో చేరనున్నారని సమాచారం. రేపు తన అనుచరులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయంటూ పలువురు నేతలు చెప్పుకొస్తున్నారు. రేపు మరోసారి జనసేన పార్టీ అధ్యక్షుడితో సమావేశమై, అనంతరం పార్టీలో చేరుతారని చెబుతున్నారు.
Also Read: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్
ఈ సందర్భంగా బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ‘పలు కారణాలతో వైసీపీకి నేను రాజీనామా చేశా. రాజకీయాలు వేరు.. బంధుత్వాలు వేరు. జగన్ రాజకీయాలు సరిగా లేనప్పుడు వ్యతరేకించా. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి. విలువలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి వచ్చినా సాయం చేశా. ప్రజల తీర్పు శిరోధార్యం’ అంటూ ఆయన పేర్కొన్నారు.