BigTV English

Bear Hunters Arrested: ఎలుగుబంటి వేట.. పురుషుల్లో లైంగిక పటుత్వం కోసమేనట..!

Bear Hunters Arrested: ఎలుగుబంటి వేట.. పురుషుల్లో లైంగిక పటుత్వం కోసమేనట..!
Bear hunters arrest at Nandyal in kurnool district
Bear hunters arrest at Nandyal in kurnool district

Bear Hunters Arrested: ఎలుగుబంటి అవయవాలు తింటే మగవారిలో లైంగిక పురుషత్వం పెరుగుతుంద న్నది ఓ మూఢనమ్మకం. దాన్ని కొందరు వేటగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పంట పొలాలలో కరెంట్ తీగలు పెట్టి ఓ ఎలుగుబంటిని వదించారు. దాన్ని ఓ వ్యాపారికి అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు నలుగురు వ్యక్తులు.


ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల ఆత్మకూరు శివపురం రేంజ్ నల్లమల్ల అటవీ ప్రాంత పరిధిలో పంట పొలాలకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు నలుగురు వ్యక్తులు. విద్యుత్ వైర్లు ఓ మగ ఎలుగుబంటి ప్రాణం తీసింది. ఎలుగుబంటి అవయవాలు తింటే పురుషుల్లో పటుత్వం పెరుగుతుందని నమ్మబలుకుతూ ఆత్మకూరులో ఓ లాడ్జిలో వ్యాపారస్తులతో డీల్ సెట్ చేసుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందడం తో వెంటనే లాడ్జిపై దాడి చేసి ముగ్గురు వేటగాళ్లతో సహా ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.

శివపురం గ్రామానికి చెందిన ఏసురత్నం, శిఖామణి, సుద్గుణరావు, సాయికుమార్‌లను అరెస్టు చేశారు. ఎండ బెట్టిన ఎలుగుబట్టి అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన అధికారులు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించారు. వారిని నంద్యాల సబ్ జైలుకు తరలించారు.


Also Read: బుక్కైన సీఎం రమేష్, 9న విచారణకు రావాలంటూ

Tags

Related News

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Big Stories

×