BigTV English

Notice to CM Ramesh: బుక్కైన సీఎం రమేష్, 9న విచారణకు రావాలంటూ

Notice to CM Ramesh: బుక్కైన సీఎం రమేష్, 9న విచారణకు రావాలంటూ

Police notice to Anakapalle bjp candidate cm ramesh on GST officers checking issue


Notice to CM Ramesh: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ అభ్యర్థికి పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. అంతేకాదు ఈనెల 9న విచారణకు రావాలని 41ఏ కింద నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసా? అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్.

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలోని చోడవరం రాజకీయ నేతలకు-అధికారుల వివాదానికి వేదికైంది. బుజ్జిబాబు ట్రేడర్ మార్బల్ టైల్ కంపెనీపై గతవారం జీఎస్టీ అధికారులు తనిఖీకి వచ్చారు. జీఎస్టీ కట్టకుండా పెద్ద మొత్తంగా ఈ కంపెనీ లావాదేవీలు జరిపినట్లు అధికారులకు సమాచారం వెళ్లింది. ఈ క్రమంలో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ప్రచారం ఉన్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు జీఎస్టీ అధికారులు చెక్కింగ్‌కు వచ్చారన్న విషయం తెలిసింది. కార్యకర్తలతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న అధికారులను ఆయన అడ్డగించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ప్రభుత్వానికి సంబందించిన కీలక ఫైళ్లను ఆయన తనతో తీసుకెళ్లినట్టు వార్తలు జోరందుకున్నాయి. దీంతో అధికారులకు-సీఎం రమేష్ మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.


దీనిపై జీఎస్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌, చోడవరం టీడీపీ కెఎస్ఎన్ రాజు సహా మరో నలుగురికిపై కేసు నమోదు చేశారు. ఈనెల 9న అంటే మంగళవారం విచారణకు రావాలని 41 ఏ కింద సీఎం రమేష్‌కు పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుల వ్యవహారంపై సీఎం రమేష్ స్పందించారు. ఇది ముమ్మాటికీ తప్పుడు కేసని చెబుతున్నారు.

ALSO READ: టీడీపీ, బీజేపీ, జనసేనపై ఐపీఎస్‌లు ఫిర్యాదు.. ఏం జరిగింది?

మరోవైపు పోలీసుల వ్యవహారశైలిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కావాలనే తమ పార్టీ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఆడిన ఎత్తుగడగా వర్ణిస్తున్నారు. ఎన్నికల వేళ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని పోలీసులు చెప్పుడం ముమ్మాటికీ తప్పుగా చెబుతున్నారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×