APLatest Updates

Beer: పాయే.. 200 కేసుల బీరు రోడ్డు పాలాయే..

beer
beer

Beer: ఎండాకాలం వస్తే మందుబాబులకు అదోరకం ఆనందం. ఎంచక్కా చల్లటి బీరు.. చేదు చేదుగా చప్పరిస్తుంటారు. మిగతా కాలాల్లోనూ బీరు దొరికినా.. ఎండాకాలంలో తాగితే ఆ మజానే వేరంటారు. అందుకే, సమ్మర్‌లో బీర్లకు బాగా డిమాండ్ అండ్ షాటేజ్. లక్షల లీటర్ల బీర్లు తాగేస్తున్నా.. ఎప్పుడూ కొరతే ఉంటుంది. చాలా వైన్స్, బార్స్‌లో నో స్టాక్ బోర్డులు పెడుతుంటారు. బీర్ సీసాపై మ్యానుఫాక్చరింగ్ డేట్ చూస్తే.. అది ఆరోజుదో, లేదంటే అంతకుముందు రోజుదో అయ్యుంటుంది. అంటే, ఎప్పటి బీర్లు అప్పుడే తాగేస్తున్నారనర్నమాట. ఇలా తయారవుతుంటే.. అలా స్వాహా చేసేస్తుంటారు మద్యంప్రియులు.

అలాంటి బీర్ లవర్స్‌కు.. కడుపు ఉసూరుమనే న్యూస్ ఇది. నడిరోడ్డుపై ఓ వ్యాన్ బోల్తా పడింది. పడితే మాకేంది? అనుకోకండి. ఆ వ్యాన్ నిండా బీర్ సీసాల కేసులు ఉన్నాయి మరి. వ్యాన్ అదుపుతప్పి పడిపోవడంతో.. 200 బీర్ కేసులు రోడ్డు మీద పడ్డాయి. బీర్ సీసాలు టపటపా పగిలిపోయాయి. రోడ్డంతా బీరు సీసా ముక్కలతో నిండిపోయింది.

అసలే బీరు. కేసులకు కేసులు పడిపోవడంతో.. వాటిలో ఏవైనా పగలకుండా ఉన్నాయా? అంటూ స్థానికులు వెతకడం మొదలుపెట్టారు. కొందరికి గాజు సీసాలు గుచ్చుకున్నా.. అట్టపెట్టెల్లో పగలని బీరు సీసాల కోసం ఎగబడ్డారు. ఇదంతా చూస్తున్న వ్యాన్ డైవరు.. చేసేందేం లేక.. అలానే చూస్తూ ఉండిపోయాడు. పగలని బీరు సీసా దొరికిన వాళ్లు పండుగ చేసుకున్నారు. ఇదంతా.. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై జరిగింది.

Related posts

International Mens Day And Mentoo Viral : నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా “మెన్ టూ” వైరల్..

BigTv Desk

Fine On Uber Cabs : ఉబర్ క్యాబ్ సంస్థపై రూ.20వేల ఫైన్..

BigTv Desk

Himachal flood news today : హిమాచల్ ప్రదేశ్ లో వరదల బీభత్సం.. కూలుతున్న ఇళ్లు..

Bigtv Digital

Leave a Comment