Latest UpdatesScience & Technology

China’s excavation : 10 వేల మీటర్ల లోతుకు చైనా తవ్వకం.. ఎందుకంటే..?

china

China’s excavation : చైనా ఏం చేసినా.. ఆలోచించి చేస్తుంది అని ఇప్పటికే చాలావరకు ప్రపంచ దేశాలు ఫిక్స్ అయిపోయాయి. చాలావరకు ప్రపంచంలో అన్నింటిలో టాప్ స్థానంలో ఉన్న దేశాలు సైతం చైనా ప్లాన్ ఏంటి అనే ఆరాతీస్తూ ఉంటాయి. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ రంగాల్లో తానే ముందుండాలి అన్న ఆలోచనతో చైనా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా అలాంటి ఒక కొత్త ప్రయోగం గురించి బయటపడింది. అదే ‘ప్రాజెక్ట్ డీప్ ఎర్త్’.

మామూలుగా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే ఇలాంటివి చూసుంటాం.. అనిపించే ప్రయోగానికి చైనా సిద్ధమయ్యింది. చైనాలోని తాక్లామాకన్ ఎడారి మధ్యలో ఒక పెద్ద రంద్రాన్ని తవ్వడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మామూలుగా చైనాలో ఆయిల్ తయారీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయోగం కూడా దానికోసమే అని అక్కడి నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి విన్న ఇతర దేశాలు మాత్రం దీని వెనుక కూడా చైనా ఏదో పన్నాగం ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు.

10 వేల మీటర్ల లోతుల్లో రంధ్రాన్ని తవ్వాలని చైనా నిర్ణయించుకుంది. ఇప్పటివరకు చైనా.. ఇంత లోతు రంద్రాన్ని తవ్వే సాహసం ఎప్పుడూ చేయలేదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ డీప్ ఎర్త్ ప్రారంభమయ్యిందని చైనా అధికారులు తెలిపారు. 30 మేన ఈ డ్రిల్లింగ్ ప్రారంభమయ్యిందని అన్నారు. హ్యూమన్ ఇంజనీరింగ్‌ను మెరుగుపరచడానికి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్టు చైనా చెప్తోంది. సరిగ్గా చెప్పాలంటే 11,100 మీటర్ల వరకు తవ్వకం జరగనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచంలోనే లోతైనా రంధ్రం తవ్విన రికార్డ్ రష్యా పేరు మీద ఉంది. 12,262 మీటర్ల లోతును తవ్వింది రష్యా. ఈ రంధ్రాన్ని తవ్వడానికి రష్యాకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. అయితే ఈ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేయాలి అనే ఆలోచనలో చైనా ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కేవలం 457 రోజుల్లోనే ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుందట అక్కడి ప్రభుత్వం. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి టాస్క్‌ను పూర్తి చేయడం కేవలం మనుషులకు మాత్రమే కాదు.. ప్రకృతికి కూడా పెద్ద ఛాలెంజ్‌లాగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

చైనా ఈ తవ్వకాన్ని జరపడం ద్వారా భూమి లోతులో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు కూడా బయటపడతాయని అధికారులు అనుకుంటున్నారు. 66 నుండి 145 మిలియన్ ఏళ్ల క్రితం జరిగిన విషయాలు ప్రాజెక్ట్ డీప్ ఎర్త్ ద్వారా బయటపడతాయని వారు భావిస్తున్నారు. ఎనర్జీ విషయంలో మిగతా దేశాలపై ఆధారడకుండా చైనా చేస్తున్న ప్రయోగమే ఇది అని కూడా కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మినర్ల, మెటల్, ఆయిల్.. ఇలా ఎన్నో వనరుల విషయంలో చైనాకు ఎలాంటి లోటు కలగదు అని భావిస్తున్నారు నిపుణులు.

Related posts

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం

Bigtv Digital

Kohinoor Diamond: కోహినూర్ మళ్లీ ఇండియాకి!.. డైమండ్ న్యూస్..

Bigtv Digital

Nitish Kumar: హాట్ టాపిక్‌గా మారిన నితీశ్ కుమార్ ఫోన్ కాల్ వ్యాఖ్యలు.. కేసీఆర్‌కు షాక్

Bigtv Digital

Leave a Comment