Bhogapuram Airport: ఏపీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లక్ష్యం కంటే ముందుగా పూర్తి చేయాలనే ఆలోచన కేంద్రం ఉంది.
ఎయిర్‌పోర్టు పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఆరోసారి భోగాపురం పనులను పరిశీలించారు.
ఇప్పటివరకు పగలు పనులను పరిశీలించిన కేంద్రమంత్రి, ఈసారి రాత్రి వేళ పనులు సందర్శించారు. రాత్రి వేళ కేంద్రమంత్రి రావడంతో అక్కడ పని చేస్తున్న అధికారులు షాకయ్యారు. నిర్మాణ పనులు చేపడుతున్న జీఎంఆర్ ఇన్‌ఫ్రా అధికారులతో మాట్లాడారు.
ప్రధాన టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్, ఏప్రాన్, డ్రైనేజీ వ్యవస్థ, ఏరో బ్రిడ్జులు, కార్యాలయ భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత నిర్మాణ, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గడిచిన నాలుగు నెలల పనుల్లో కీలక పురోగతి సాధించామని వారి నుంచి అవుట్ ఫుట్ రావడంతో మంత్రి హ్యాపీగా ఫీలయ్యారు. దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. విభాగాల వారీగా పనుల వివరాలను తెలియజేశారు.
ALSO READ: వైసీపీ సోషల్ మీడియా టీం మెంబర్స్ అరెస్ట్..
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వీలైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
భోగాపురం పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.