Gundeninda GudiGantalu Today episode November 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఇంట్లోకి వచ్చిన మీనాను క్షమించమని అడిగినా మాటలతో మనసు బాధ పడేలా చేస్తారు..ఆ నాన్న కోసం తీసుకొచ్చానని చెప్పడంతో మీనా ఇలానే ఉంటారా? ఇక జీవితాంతం ఇంతేనా అంటుంది.. ఇక ఉదయం లేవగానే అన్ని పనులను చేస్తుంది మీనా.. అంతేకాదు టిఫిన్ రెడీ అయ్యిందనీ తినమని సత్యంను అడుగుతుంది. రోహిణి, ప్రభావతి లు కిందకు వస్తారు. ఈ మహా తల్లి రావడం మంచి పనైంది.. బండెడు చాకిరీ నాకు తగ్గింది అనేసి ప్రభావతి అంటుంది. దానికి రోహిణి కూడా అవును నిజమే అంటుంది. ఇక మీ కూతురు లాంటి కోడలు టిఫిన్ చేసింది వెళ్లి టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకుని ప్రభావతి అంటుంది. అప్పుడు పూరి చేసినట్లు మీనా చెప్పింది. దానికి రోహిణి, ప్రభావతి లు పెద్ద క్లాసులు పీకుతారు. ఇక ఇడ్లి చేశాను అని చెప్తుంది. బాలు కూడా మీనా చేసిన టిఫిన్ ను తినని చెబుతాడు. ఇక మీనా మౌనిక, సత్యంలు టిఫిన్ చేస్తారు. నైట్ బాలు తాగొచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. ప్రభావతి మీనాకు వార్నింగ్ ఇస్తుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే మీనా వంట గదిలో ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావని మీనా ను ప్రభావతి అడుగుతుంది. దానికి మీనా మీరు ఏం చెప్తే అది చేస్తాను అత్తయ్య అని అంటుంది. దోస చేయి అనేసి ప్రభావతి అనగానే, మీరు నిన్న చెప్పిన డే దోశ చేసేదన్న అత్తయ్య పెళ్లి లేదు అనేసి అంటుంది. అయితే ఇడ్లీ పెట్టు అని అంటుంది. ఇడ్లీ పెట్టడానికి రవ్వ లేదు అయిపోయింది అని అంటుంది. అప్పుడు రోహిణి తిట్టు చూస్తుంది. పూరి వద్దులే అని అంటుంది. ఇంకేమున్నా ఇంట్లో చేయడానికి అని అంటే సరుకులని అయిపోయాయి అత్తయ్య అని మీనా చెప్తుంది. ముందే చూసుకోవాలి కదా ఇప్పుడు చెప్తే ఎలా అనేసి అంటే నేను లేను కదా అత్తయ్య నాకు తెలియదు ఉప్మా రవ్వ ఉంది ఉప్మా చేయమంటారు అని నేను అడుగుతుంది. ఉప్మా అంటే అందరూ నా మీద పడిపోతారేమో ఏదో ఒకటి చెయ్యి కానీ ఆయిల్ అంత వేయాలో రోహిణి అడిగి చేయి అనేసి అంటుంది. ఇక రోహిణి ఏం చేస్తున్నావ్ అని అడిగితే మీకోసం మిల్క్ షేక్ చేస్తున్నా అత్తయ్య అని అంటుంది. ఇక మనోజ్ కిందికి వస్తాడు. పేపర్ చదువుతున్న సత్యం ను నాన్న టిఫిన్ చేసి మందులు వేసుకున్నావా అని అడిగితే నువ్వు టిఫిన్ కోసం అడుగుతున్నావు అని అర్థమైంది పొయ్యి మీ అమ్మని అడుగు అనేసి అంటాడు. అమ్మ టిఫిన్ అయిందా అని అంటే రోహిణి చేస్తుంది రా అనేసి ప్రభావతి అంటుంది. రోహిణిని ఏం చేస్తున్నారు రోహిణి అంటే మిల్క్ షేక్ చేస్తున్నాను మనోజ్ అని అంటే అది చాలా టైం పట్టేలా ఉంది. నేను బయట తింటాలే అనేసి అంటాడు. బయట వాడు ఎలాంటి ఆయిల్ వాడాడో తెలియదు. . ఇప్పుడు ఆయిల్ వాడుతాడో తెలీదు. అది తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు నీ కోసం ఏబీసీ జ్యూస్ చేసి ఇస్తాను ఆగు అనేసి అంటుంది. అయితే నాకు వద్దు నేను బయట తింటా అనేసి వెళ్ళిపోతాడు మనోజ్.
మనోజ్ బయటికి వెళ్లడం చూసి దిలీప్ లోపలికి వస్తాడు. కొరియర్ అని చెప్పగానే మీ నాన్న వెళ్లి చూడమని ప్రభావతి చెప్తుంది. మీరు రోహిణి నా ఇది రోహిణి గారికి వచ్చింది రోహిణి అని పిలుస్తారని అడుగుతాడు. అప్పుడు రోహిణి వస్తుంది. మీ నాన్న కొరియర్ ద్వారా డబ్బులు ఏమన్నా పంపాడుకి డబ్బులు లేవు కదా సరిపోతాయి అనుకుంటూ ప్రభావతి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది రోహిణి అప్పుడు దిలీప్ ని చూసి షాక్ అవుతుంది. నేను నీతో మాట్లాడాలి అనేసి అంటే అప్పుడు ప్రభావతిని ఏదో ఒకటి కవర్ చేసి లోపలికి పంపిస్తుంది. ఎందుకు వచ్చావు అని దిలీప్ ని అడుగుతుంది రోహిణి. నా నెంబర్ బ్లాక్ చేస్తే ఇంటికి రాక ఇంకెక్కడికి వెళ్తానని దిలీప్ అంటాడు. ఎందుకు వచ్చావో చెప్పు అని రోహిణి కోపంగా అడుగుతుంది. నాకు అర్జెంటుగా 50,000 కావాలి అంటే డబ్బులు నా దగ్గర లేవు ఎలా ఇవ్వాలి అంటే నీ రహస్యం నా దగ్గర ఉంది నేను చెప్పనా కళ్యాణి అనేసి అంటాడు. అసలు నీకు డబ్బులు పంపే నాన్నే లేడు మరి నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు ఇదంతా మీ ఇంట్లో వాళ్లకి చెప్పనా ఈసారి డబ్బులు ఇవ్వకుంటే నేరుగా మీ ఇంట్లో వాళ్లకి వచ్చేసి చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. నువ్వు వెళ్ళు నేను డబ్బులు ఎలాగోలాగా ఏం చేస్తానని చెప్పి రోహిణి అంటుంది.
ఇక అది మీనా చూస్తుంది. నువ్వు చెప్పమంటావా నన్ను చెప్పమంటావా అత్తయ్యకి అనేసి అంటుంది. ఏంటి అని రోహిణి అడగా ఉప్మాలో ఆయిల్ ఎంత వేయాలో నిన్ను అడగమని నిన్ను చెప్తావా అత్తయ్య చెప్పమని చెప్తావా అనేసి అంటుంది. సరే పద నేనే వస్తున్నా అని రోహిణి లోపలికి వెళ్తుంది. ఇది దిలీప్ గాడు ఇంటికి వచ్చేలా చచ్చాడు ఏంటి ఇంత ట్రస్ట్ ఇచ్చాడు ఏంటి అని రోహిణి లోపలికి వెళ్లి ఆలోచిస్తుంది . అప్పుడే మనోజ్ ఇంటికి వస్తాడు. నువ్వు ఇప్పుడే కదా వెళ్లావు అప్పుడే వచ్చావ్ ఏంటి అని అంటే ఫోన్ కోసం వచ్చానని మనోజ్ అంటాడు. నీకు బోనస్ ఎప్పుడు ఇస్తారు నేను దీపావళికి పార్లర్లో శాలరీ ఇవ్వాలి అనేసి అంటుంది రోహిణి. అది బయట నుంచి ప్రభావతి ఉంటుంది. మనోజ్ ప్రభావతి దగ్గరకు వచ్చి అమ్మ నువ్వే నన్ను గట్టి ఎక్కించాలి ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేయమ్మా అనేసి అంటాడు. ఇక ప్రభావతి మీనాక్షి కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. మీనాక్షిని డబ్బులు కావాలని అడుగుతుంది. నా దగ్గర డబ్బులు ఎక్కడివి నీకు తెలియదా? చిట్టి డబ్బులు మాత్రమే ఉన్నాయి అవి తీసుకొని నాకు ఇవ్వు అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో బాలు వాళ్ళ బామ్మ దీపావళికి అందర్నీ పిలుస్తుంది. అక్కడే దీపాలు జరుపుకుందాం రమ్మని చెప్తుంది. కొత్తగా పెళ్లైన రవిని కూడా పిలవాలని ప్రభావతి అంటుంది ఆ మాట అనగానే బాలు ఫైర్ అవుతాడు. వారిద్దరి మధ్య వాదన జరుగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..