బిగ్ బాస్ సీజన్ వన్ ప్రారంభమైనప్పుడు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది బుల్లితెర యాంకర్ హరితేజ (Hariteja). తన ఆటతీరుతో టాప్ ఫైవ్ లో ఒకరిగా చలామణి అయిన ఈమె.. ఆ తర్వాత అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సినిమాలలో నటిస్తూ.. మరొకవైపు పలు షోలకు హోస్టుగా కూడా వ్యవహరించింది. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవ్వడంతో.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి.. అనుకోకుండా పదవ వారం ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది.
వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ లోకి హరితేజ అడుగుపెట్టిన తర్వాత తన ఆట లో దాదాపు చాలా మార్పులు వచ్చాయి. మాటలతో తోటి కంటెస్టెంట్స్ ని కూడా బాధ పెట్టింది హరితేజ. ప్రత్యేకించి యష్మి ని టార్గెట్ చేస్తూ.. ఆమె బాగా ఆడుతున్నా తప్పు నీదే అన్నట్టుగా చూపించింది. దీంతో కొంతమంది ఆడియన్స్ కి ఈ విషయం మింగుడు పడలేదు. దీనికి తోడు హరితేజ స్వార్థపూరితమైన ఆటలతో గెలవాలనే ప్రయత్నం చేసింది. కానీ సీజన్ వన్ లా ఇక్కడ ప్రవర్తించడం లేదు అంటూ కొంతమంది నిట్టూర్చారు. అంతేకాదు ఈమెను ఎలిమినేట్ చేయాలని డిమాండ్ కూడా చేశారు.
ఇకపోతే ఆదివారం అనగానే ‘సండే ఫండే’.. దీనికి తోడు ఆ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ఉత్కంఠ కూడా నెలకొంటుంది. ఇక పదవ వారం నామినేషన్స్ లో ప్రేరణ ,పృథ్వి, యష్మీ, నిఖిల్ , విష్ణుప్రియ, గౌతమ్, హరితేజ ఉన్నారు. దీంతో ముందుగా నాగార్జున ప్రేరణ, గౌతమ్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఇక తర్వాత ‘మట్కా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ (Varun Tej) బిగ్ బాస్ స్టేజ్ పైకి రాగా.. నాగార్జున వరుణ్ తేజ్ ను మట్కా సినిమా విశేషాలు అడిగి మరీ తెలుసుకున్నారు. అలాగే ట్రైలర్ కూడా చూశారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ ఇంటి సభ్యులతో చాలా సరదాగా గడిపారు. అనంతరం అవినాష్, టేస్టీ తేజ చేసిన డాన్స్ ను చూసి వరుణ్ తేజ్ తెగ ఎంజాయ్ చేశారు.
ఎలిమినేషన్ విషయంలో ఉత్కంఠ పెరగగా.. నిఖిల్, విష్ణుప్రియ సేఫ్ అవుతారు. చివరికి నామినేషన్స్ లో హరితేజ, యష్మి మిగలగా.. చివరికి హరితేజ ఎలిమినేట్ అయింది. దీంతో కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత హౌస్ ను వీడి స్టేజ్ పైకి రాగానే తన జర్నీని చూసుకొని ఎమోషనల్ అయింది హరితేజ.
ఇక తర్వాత నాగార్జున తనకు ఒక టాస్క్ కూడా ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో మాస్క్ తీసి గేమ్ ఆడాల్సిన వ్యక్తులు ఎవరో ఐదుగురు పేర్లు చెప్పాలని అడగ్గా.. అవినాష్ , టేస్టీ తేజ, రోహిణి, నిఖిల్, ప్రేరణ పేర్లు తెలిపింది. అవినాష్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు కానీ ఆయన నిజ స్వరూపం తెలియదు. ఇప్పటికైనా ముసుగు తీయాల్సిన టైం వచ్చింది. అలాగే రోహిణి కూడా అంతే.. ఏదో దాచుకొని గేమ్ ఆడుతోంది.. టేస్టీ తేజ కూడా రూల్స్ చెబుతాడు.. కానీ పాటించాడు. నిఖిల్, ప్రేరణ కూడా కొన్ని ఎమోషన్స్ చూపించాలి కానీ కొన్ని దాచుకోవాలి.. ఇప్పటికైనా కరెక్ట్ గా పెర్ఫార్మ్ చేయకపోతే ఎలిమినేట్ అవుతారు అంటూ హెచ్చరికతో పాటు సలహాలు కూడా ఇచ్చింది.