BigTV English

BJP: సుజనా చౌదరికి బిగ్ షాక్.. బీజేపీ ప్రయారిటీ మారిందా?

BJP: సుజనా చౌదరికి బిగ్ షాక్.. బీజేపీ ప్రయారిటీ మారిందా?
sujana chowdary

BJP: సుజనా చౌదరికి చెందిన ‘మెడిసిటీ’ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.. ఇదీ న్యూస్. ఇంతే.


అంతేనా? ఇంకేం లేదా? అంటే చాలానే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎంపీ సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఒకసారి కాషాయ కండువా కప్పుకున్నారంటే.. ఇక వారి తప్పులు, అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయని అంటుంటారు. గంగలో మునిగితే ఎలాగైతే పునీతులవుతారో.. అలా కాషాయ శిబిరంలో చేరితే.. ఇక వారిపై చీమ కూడా వాలదనే విమర్శ ఉంది. బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ దర్యాప్తు సంస్థలను విమర్శించే సందర్భంలో పదే పదే సుజనా చౌదరి పేరు ప్రస్తావిస్తుంటారు. ఆయనపై గతంలో ఈడీ కేసులు ఉన్నాయని.. సుజనా బీజేపీలో చేరగానే ఈడీ దర్యాప్తు అటకెక్కిందని ఆరోపిస్తుంటారు. అలాంటి బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరికి చెందిన మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు కావడమంటే మాటలా? అదికూడా కేంద్రం ఆధ్వర్యంలోని జాతీయ మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగానూ ఆసక్తికరంగా మారింది.

మెడిసిటీ మెడికల్ కాలేజీ. పేరు బాగానే వినిపించేది. ఏమైందో ఏమోగానీ ఇప్పుడు వేటు పడింది. బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి.. ఇలా వేటు పడే వరకూ ఎందుకు తెచ్చుకున్నారు? మరీ, అంతగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందా? ఈడీనే టచ్ చేయకుండా చూసుకున్న సుజనా.. మెడికల్ కౌన్సిల్ యాక్షన్‌ నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈడీ ఆర్థిక మోసాలు, మోసగాళ్ల పనిపట్టే సంస్థ. మెడికల్ కౌన్సిల్ అంటే మనుషుల ప్రాణాలను కాపాడే ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను పర్యవేక్షించే సంస్థ. మెడికల్ కాలేజీలో ప్రమాణాలు పాటించకపోతే.. ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నట్టే. అందుకే, ఇలాంటి విషయాల్లో మనోడు, మన పార్టీ లాంటి ఈక్వేషన్లు పని చేయవంటున్నారు. అందుకే, మెడిసిటీపై వేటు పడిందని చెబుతున్నారు.


Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×