Big Shock to YS Jagan: జగన్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయా? పార్టీ పరంగా కాకుండా, సొంతంగా దెబ్బ తగిలిందా? మళ్లీ జమిలి ఎన్నికలంటూ కార్యకర్తలు, నేత లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? లేటెస్ట్‌గా సరస్వతి పవన్ ఇండస్ట్రీస్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా రెచ్చిపోతే.. అధికారం కోల్పోయిన తర్వాత అంత కంటే ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొందరు సీనియర్ రాజకీయ నేతలు తరచూ చెప్పే మాట. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో ఓ రేంజ్‌లో టీడీపీని ఆడుకుంది వైసీపీ. ఇప్పుడు టీడీపీ వంతైంది.
లేటెస్ట్‌గా సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం మేఘవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 3.89 ఎకరాలు మొత్తమంతా కలిసి దాదాపు 18 ఎకరాలు అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములపై ఫోకస్ చేసింది. పల్నాడు జిల్లాలో ఆ కంపెనీకి చెందిన భూముల్లో రెవిన్యూ, అటవీ భూములున్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వ అధికారులు వేర్వేరుగా సర్వే చేపట్టారు. దాదాపుగా నాలుగు మండలాల్లో సర్వే చేశారు.
ALSO READ: వైసీపీలో నావల్ల కాదు, జగన్‌పై అవంతి ఫైర్.. బ్రిటీషర్ల తరహాలో నిర్ణయాలు
చివరకు మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 20 ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు తేల్చారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరుతూ అసైన్డ్ రైతులు, అమ్మకాలకు సహకరించిన మధ్యవర్తులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 18 ఎకరాల అసైన్డ్ భూములున్నట్లు తేలడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ భూముల లోతుల్లోకి వెళ్తే.. సరిగ్గా వైఎస్ఆర్ హయాంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పరిశ్రమ కోసం 1716 ఎకరాల భూములను కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూములతోపాటు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ ప్రజల నుంచి భూములను సేకరించింది వైఎస్ ఫ్యామిలీ. అందులో అటవీ భూములు, వాగులు, వంకలు ఉన్నాయి.
దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా, అక్కడ ఫ్యాక్టరీ నిర్మించలేదు. ఈలోగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, ఆయా భూముల్లో గనుల లీజును 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు పరిశ్రమ ఏర్పాటు చేయకపోయినా నీటి కేటాయింపు చేశారు. అయితే అసైన్డ్ భూముల్లో సహజ వనరులు ఉన్నాయని ఆరోపణలు వెళ్లువెత్తడంతో నవంబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించిన విషయం తెల్సిందే.
అప్పట్లో వేల ఎకరాల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు ఆరోపణలు చేశారు. చివరికి 18 ఎకరాలు అసైన్డ్ భూములను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మరి, ఆ రోజు అంత హడావిడి చేసి ఈ రోజు తుస్సుమనిపించారే అని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. ఈ చర్యలు జగన్‌పై పెద్దగా ప్రభావం చూపవని కూడా అంటున్నారు. కానీ, అన్ని వేల ఎకరాల్లో కనీసం ఒక్క ఎకరా అసైన్డ్ భూమి అని తేలినా అది అక్రమమే. కాబట్టి, వైసీపీ నేతలు దీన్నిపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి.