BigTV English

BB Telugu 8: గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం.. ట్రోఫీ ఆయన చేతుల మీదుగా..!

BB Telugu 8: గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం.. ట్రోఫీ ఆయన చేతుల మీదుగా..!

యావత్ దేశ ప్రజలంతా ఏదైనా ఒక మంచి రియాల్టీ షో కోరుకుంటే..అందులో బిగ్ బాస్ (Bigg Boss)మొదటి స్థానంలో ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ముక్కు మొహం తెలియని వారితో ఏకంగా 105 రోజులు హౌస్ లో గడపడం అంటే అది ఎంత పెద్ద టాస్కో ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ పెట్టి కఠిన టాస్క్ లను గెలవాల్సి ఉంటుంది. హౌస్ లో తమ ప్రవర్తనతో బయట ఆడియన్స్ ను మెప్పించాల్సి ఉంటుంది. అప్పుడే టైటిల్ విజేతగా నిలుస్తారు. లేకపోతే మధ్యలోనే ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. బిగ్ బ్రదర్ గా పాశ్చాత దేశాలలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో బిగ్ బాస్ అంటూ హిందీలో మొదటిసారి ప్రారంభమై ప్రతి ఒక్కరిని అలరించింది. ఇక ఈ షో కి వస్తున్న ఆదరణను చూసి తెలుగులో స్టార్ మా నిర్వాహకులు కూడా హిందీలో ప్రారంభమైన పదేళ్లకు అంటే 2017లో మొదటి సీజన్ ను ప్రారంభించారు. బిగ్ బాస్ అంటూ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ షో భారీ సక్సెస్ ను అందుకుంది.


ఇక దీంతో ప్రతి ఏడాది కూడా కొంతమంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకువచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో డిసెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్గా ఫినాలే నిర్వహించనున్నారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు టైటిల్ విజేతగా నిలవడానికి మొత్తం ఐదు మంది హౌస్ మేట్స్ పోటీ పడుతున్నారు. అందులో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ ఇలా మొత్తం ఐదు మంది టైటిల్ కోసం పోరాడుతూ ఉండగా.. తాజాగా జరుగుతున్న ఓటింగ్ లెక్కలు కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈరోజు మొదటి స్థానంలో ఉన్నవారు రేపు రెండవ స్థానానికి పడిపోతున్నారు. నిన్న చివరి స్థానంలో ఉన్నవారు ఈరోజు మూడవ స్థానానికి వచ్చేస్తున్నారు. ఇలా ఓటింగ్ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తోంది.

ఇకపోతే ఫ్యామిలీ వీక్ అనగా 11వ వారం నుంచే నిఖిల్ టైటిల్ విన్నర్ కాబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇక అందుకు తగ్గట్టుగానే నిర్వాహకులు కూడా సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఓటింగ్ లో కూడా నిఖిల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇక విజేతగా ఆయనే నిలువనున్నట్లు సమాచారం. ఇకపోతే విజేతకు ట్రోఫీని ఈసారి ఎవరి చేతులు మీదుగా ఇవ్వబోతున్నారు అనే వార్త తెరపైకి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే ‘పుష్ప -2’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్(Allu Arjun)ఈ మెగా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.విన్నర్ కి ఆయన చేతుల మీదుగానే ట్రోఫీ అందజేస్తారట. దీనిపై ఈరోజు లేదా రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఐదు మంది ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×