Elon Musk $400 Billion| ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ (53) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని అందరికీ తెలుసు. కానీ ఆయన ఆస్తి ఇప్పుడు శరవేగంగా పెరుగుతూ పోతోంది. ఆయనతో పోటీపడే ప్రపంచ ధనవంతులు మస్క్‌కు సరితూగే ఆస్తి సంపాదించడం ఒక కలగానే మిగిలిపోతుందేమో. ఎందుకంటే ఆయన ఆస్తి విలువ 400 బిలియన్ డాలర్లు దాటేసింది. ప్రపంచంలో చాలా మంది ధనవంతులు భారీగా సంపాదిస్తుంటారు. ఆస్తులు కూడగడుతుంటారు. అయితే ఎవరూ తమ ఆస్తిని స్థిరంగా పెంచుకున్నట్లు చరిత్రలో లేదు. ఎప్పుడో ఒక్కసారి వారి ఆస్తులు తగ్గుతూ వచ్చాయి. అయితే ఎలన్ మస్క్ చరిత్రలో ఎవరూ సంపాదించలేనంతగా ఆస్తులు కూడగట్టారు.
బ్లామ్ బర్గ్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం.. నవంబర్ 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత.. ట్రంప్ కోసం అన్నీ తానై ప్రచారం చేసిన ఎలన్ మస్క్, ఇప్పుడు దాని లాభాలు పొందుతున్నారు. ట్రంప్ విజయంతో ఎలన్ మస్క్ కంపెనీల షేర్ల విలువ అమాంతం పెరిగిపోతోంది. తాజాగా ఒక్కరోజులో ఆయన అంతరిక్ష రాకెట్ లాంచ్ కంపెనీ స్పేస్ ఎక్స్ షేర్ల విలువ భారీగా పెరిగింది. దీంతో ఎలన్ మస్క్ నెట్ వర్త్ (నికర ఆస్తులు) 50 బిలియన్ డాలర్లు పెరిగింది. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్ లో మస్క్ కంపెనీలు రాకెట్ వేగంతో పైపైకి దూసుకుపోయాయి. స్పేస్ ఎక్స్ తో పాటు ఆయనకు చెందిన ప్రీమియం ఎలెక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు కూడా ఆల్ టైమ్ హై గా రికార్డ్ అయ్యాయి. దీంతో ఎలన్ మస్క్ ఆస్తి విలువ ప్రస్తుతం 447 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.38 లక్షల కోట్లు. కానీ స్టాక్ మార్కెట్ ముగిసే సరికి ఈ గణాంకాలు 424 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి.
మస్క్ కు చెందిన టెస్లా షేర్లు, స్పేస్ టెక్స్ షేర్ల విలువ కలిపితే ఒక్కరోజులో ఆయన ఆస్తి 62.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఒక్కరోజులో ఇంత ఆదాయం చరిత్రలో ఏ ధనవంతుడికీ దక్కలేదు. మస్క్ తో పాటు ప్రపంచంలోని 500 మంది ధనవంతుల ఆస్తులు కూడా ఆ రోజే భాగా పెరిగాయి. ఈ 500 మంది ఆస్తులు కలిపితే.. వాటి విలువ 10 ట్రలియన్ డాలర్లు అని బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ రిపోర్ట్. ఈ 500 మంది ఆస్తుల విలువ గత సంవత్సరం జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, దేశాల జిడిపీతో సమానమని ప్రపంచ బ్యాంక్ డేటాతో పోలిస్తే తెలుస్తోంది.
Also Read: పుట్టుకతో అమెరికా పౌరసత్వం రద్దు చేస్తా.. ట్రంప్ అధికారం చేపట్టాక ఇండియన్స్‌పై కొరడా
ఎలన్ మస్క్ 2024లో సంపాదన చూస్తే.. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయన ఆస్తులు 218 బిలియన్ డాలర్లు పెరిగాయి. వీటిలో ఎక్కువగా టెస్లా కంపెనీ షేర్ల విలువ భారీగా పెరగడంతో వచ్చింది. మస్క్ సంపాదనలో టెస్లా ద్వారానే 71 శాతం వృద్ధి వచ్చింది.
ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక ఎలన్ మస్క్ బిజినెస్ కు బాగా కలిపి వస్తుందనే నమ్మకంతో అమెరికా ప్రజలు భారీగా ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ఆమోదం లభిస్తుందని, ఎలెక్ట్రిక్ వాహనాలకు ట్యాక్ క్రెడిట్స్ దక్కుతాయని భావిస్తున్నారు. వీటికి తోడు ఎలన్ మస్క్ ఏకంగా ప్రభుత్వంలోనే కీలక బాధ్యతలు చేపట్టనన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే బాధ్యత ఆయనపై కూడా మోపారు ట్రంప్.
మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి ఎక్కువ ఆదాయం ప్రభుత్వ కాంట్రాక్టులతోనే వస్తుంది. ట్రంప్ అధికారం వచ్చాక ఈ ఆదాయం భారీగా పెరిగుతుందని పెట్టుబడుదారులు ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు. మరోవైపు మస్క్ కొత్త ఏఐ కంపెనీ ఎక్స్ ఏఐ విలువ కూడా 50 బిలియన్ డాలర్లకు చేరింది.