Imtiaz Ahmed Resigns YCP: ఏపీలో ప్రతి పక్ష వైసీపీకి ఎదురు గాలులు తీవ్రంగా వీస్తున్నాయ్. ప్రతి రోజూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ తప్పడం లేదు. ఒక పక్క కేసుల పరంపర నాన్ స్టాప్ గా ఫ్యాను పార్టీ రెక్కలు విరిచేస్తుంటే.. మరో పక్క కొందరు కీలక నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు, వైఎస్ఆర్ ఫ్యామిలీకి వీర విధేయులు సైతం వరుసగా రాజీనామాలు చేసేస్తున్నారు. అయితే తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇంతియాజ్ అహ్మద్ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. నాలుగేళ్లు పదవీకాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని మరీ రాజకీయాల్లోకి వచ్చిన ఇంతియాజ్ అహ్మద్ ఒక్క ఎలక్షన్‌కే ఏకంగా రాజకీయాల నుంచి నిష్క్రమించారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ గా, సీసీఎల్ సెక్రటరీగా అనేక కీలక పదవి నిర్వహించి.. జగన్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించారు ఇంతియాజ్. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గత తప్పిదాలపై కేసులు పెడతానే భయంతో రిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానే తప్ప ప్రజా సేవరంగానికి కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇంతియాజ్ బాటలోనే మరికొంత మంది వైసీపీ నేతలు రాజీనామాలు చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇంతియాజ్ పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగినట్లేనా లేక కూటమి పార్టీలలో చేరతారా అనేది సస్పెన్స్ గా మారింది.
Also Read: అంతా పెద్ది రెడ్డే చేశారంట? జగన్‌కు సొంత నేతలు ఫిర్యాదు
ఇక ఇటీవల సీనియర్ వైసీపీ లీడర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. పార్టీలో బ్రిటీష్ కాలం నాటి పాత కాలపు పద్ధతులు పాటిస్తున్నారనీ.. ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని జగన్ తీస్కుంటున్న నిర్ణయాల ద్వారా కార్యకర్తలుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అవంతి. దానికి తోడు తాను ఐదేళ్లుగా కుటుంబానికి దూరమయ్యాననీ.. కుటుంబంతో కొంత కాలం గడపాలనుకుంటున్నాననీ. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అవంతి శ్రీనివాస్. ఓటమిపై జగన్ విశ్లేషించుకోవాలని సూచించారు అవంతి శ్రీనివాస్.
పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల జగన్ సానుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా తమకు అనిపించడం లేదని.. ఇంటి దగ్గరకొచ్చి తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారనీ.. అయితే ఆయన తన పాలనలో.. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి పాలించారనీ. ఈ ప్రాంతం వైవీ చేతుల్లోకి వెళ్లిందని. మేము వైవీ చేతుల్లో కీలుబొమ్మలుగా మరాల్సి వచ్చిందని.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గ్రంధి. మరోవైపు జగన్ తన సొంత జిల్లా కడపలో భారీ ఎత్తున కార్పొరేటర్లు పార్టీ మారనున్న సంగతి తెలిసిందే.