Boney Kapoor: శ్రీదేవి, బోనీ కపూర్‌ది ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ అని ఫ్యాన్స్ ఫీలవుతుంటారు. శ్రీదేవి అంటే అప్పట్లో నటులకు, దర్శకులకు క్రష్ ఉన్నా కూడా తను మాత్రం ఏరికోరి బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటికే బోనీకి పెళ్లయినా కూడా తను పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు 2 దశాబ్దాల పాటు శ్రీదేవి, బోనీ కపూర్ హ్యాపీ కపుల్‌గా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం చెందింది. తను మరణించినా కూడా శ్రీదేవి గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ బోనీ కపూర్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా శ్రీదేవి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. అలా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఓపెన్‌గా ఒక విషయం బయటపెట్టారు బోనీ కపూర్.
మోసం చేయలేదు
‘‘శ్రీదేవి, నేను ఎప్పటికీ విడిపోలేము. నేను అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నేను చచ్చేంత వరకు కూడా తనను ప్రేమిస్తూనే ఉంటాను. చాలా అందమైన అమ్మాయి, మంచి గుణం ఉన్న అమ్మాయి మీతో కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటే అంతకంటే పెద్ద సంతోషం ఏముంటుంది? నా విషయంలో కూడా అదే జరిగింది. నేనెప్పుడూ తనను చీట్ చేయలేదు. పక్క చూపులు చూడాల్సిన అవసరం రాలేదు. తనే నాకు అన్నీ అనుకున్నాను’’ అంటూ శ్రీదేవిపై తనకు ఉన్న ప్రేమను మరొకసారి బయటపెట్టారు బోనీ కపూర్. శ్రీదేవి వెంట చాలామంది పడుతున్నా కూడా అన్ని తెలిసి బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుందనే విషయం తనకు కూడా తెలుసు.
Also Read: డబ్బుల కోసమే అలాంటి సినిమాలు, అదే ట్రెండ్ అయిపోయింది.. బాలీవుడ్ స్టార్ వ్యాఖ్యలు
అట్రాక్ట్ అవ్వడం సహజం
శ్రీదేవి (Sridevi) ఎంత అందంగా ఉన్నా.. తనపై ఎంత ప్రేమ ఉన్నా కూడా బోనీ కపూర్ మనసు కొన్ని సందర్భాల్లో చెలించింది అనే విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. అప్పుడప్పుడు వేరే అమ్మాయిలకు అట్రాక్ట్ అయ్యానని ఓపెన్‌గా చెప్పేశారు. ‘‘ఇప్పటికీ కూడా నాకు ఆడవారిలో ఫ్రెండ్స్ ఉన్నారు. నా చుట్టూ ఉన్న ఆడవారికి నేను అట్రాక్ట్ కూడా అవ్వొచ్చు. కానీ శ్రీదేవిపై నా ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. తనపై నాకు ఉన్న ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేను. అలాంటి ఫీలింగ్స్ ఇంకెవరికీ రావు’’ అని నిర్మొహమాటంగా చెప్పేశారు బోనీ కపూర్. ఆయన నిజాయితీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఇంత ఓపెన్‌గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైమ్ అని అనుకుంటున్నారు.
సలహాలు, సూచనలు
‘‘కలిసి చేసే ప్రయాణంలో మన పార్ట్నర్ గురించి మనం చాలా తెలుసుకుంటాం. వారు ఇష్టపడని విషయాలు చేయకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకనొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. పెళ్లయిన మొదటి ఏడు సంవత్సరాలు అన్నీ భరించాల్సి ఉంటుంది. కానీ ఆ ఏడేళ్ల తర్వాత ముఖ్యంగా పిల్లలు పుట్టి పెద్దగా అయిన తర్వాత అప్పుడే భార్య తన అసలు ఫీలింగ్స్‌ను మీతో షేర్ చేసుకోవడం మొదలుపెడుతుంది’’ అంటూ రిలేషన్‌షిప్ సలహాలు కూడా ఇచ్చారు బోనీ కపూర్ (Boney Kapoor).