Big TV Effect: బిగ్ టీవీ కథనానికి అనుహ్య స్పందన లభించింది. కేరళలో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బిగ్ టీవీ ప్రచురించిన కథనానికి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బిగ్ టీవీ కథనాన్ని ప్రచురించడంతో పాటు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నారా లోకేష్ వెంటనే స్పందించి అయ్యప్ప భక్తులకు ఆపన్నహస్తం అందించారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలం గొడుగు చింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరి వెళ్లారు. వారు బయలుదేరి వెళ్లిన వాహనం మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురికాగా, స్వాములు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కేరళ పోలీసులు తమ వద్దకు చేరుకున్నా.. తమకు సహకరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అయ్యప్ప భక్తులు వీడియో విడుదల చేశారు. దీనితో అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యను బిగ్ టీవీ కథనాన్ని ప్రచురించింది. అలాగే బిగ్ టీవీ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా వారి సమస్యను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లింది.
ఈ నేపథ్యంలో బిగ్ టీవీ పోస్ట్ కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. వాహన ప్రమాదం వల్ల కేరళలో చిక్కుకున్న గంగాధర నెల్లూరుకు చెందిన అయ్యప్ప భక్తులకు సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే కేరళ ప్రభుత్వం తో మాట్లాడి అందరిని వెనక్కు తీసుకువచ్చేలా ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు లోకేష్, అయ్యప్ప భక్తులకు హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు.. తమ ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన బిగ్ టీవీకి, స్పందించిన మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ లపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ఇటీవల ఎందరో భాదితులకు అభయహస్తం ఇవ్వడం తెలిసిందే. మొన్న ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ ను అభినందించిన లోకేష్, అతని ఉద్యోగం మరలా వచ్చేలా తీసుకున్న చర్యలకు సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ అభినందనలు తెలిపారు. అలాగే ఇటీవల ఓ చిన్నారి ఆపరేషన్ కోసం తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న లోకేష్, వెంటనే వారికి ప్రభుత్వం తరపున సాయం అందించారు. తాజాగా కేరళలో చిక్కుకున్న అయ్యప్ప భక్తులకు లోకేష్ ఆపన్నహస్తం అందించడం, వారిని వెనక్కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటానంటూ హామీ ఇవ్వడంతో నెటిజన్స్ మరోమారు లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బిగ్‌టీవీ పోస్ట్‌పై స్పందించిన నారా లోకేష్
వాహన ప్రమాదం వల్ల కేరళలో చిక్కుకున్న గంగాధరనెల్లూరుకు చెందిన అయ్యప్ప భక్తులకు సాయం చేస్తామన్న లోకేష్
కేరళ ప్రభుత్వంతో మాట్లాడి అందరినీ వెనక్కి తీసుకొస్తామని హామీ@naralokesh#Sabarimala #Piligrims #Bigtv https://t.co/2Vx1HkoBIe pic.twitter.com/c3IUZHDcZB
— BIG TV Breaking News (@bigtvtelugu) November 19, 2024