Shoaib Akhtar: టీమిండియాలో ఎంతోమంది స్టార్ క్రికెటర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అందులో కొంతమంది మాత్రమే స్టార్ క్రికెటర్లు గా ఎదుగుతున్నారు. మరికొంతమంది క్రికెటర్లు మాత్రం అడపా దడప్ప మ్యాచులు ఆడి ఆ తర్వాత చాన్సులు లేక అల్లాడుతున్నారు. కానీ తమ చిన్ననాటి తనంలోనే టీమిండియా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి…. దాదాపు 20 సంవత్సరాల పాటు టీమ్ ఇండియాను ఏలిన క్రికెటర్లు కూడా ఉన్నారు.
Also Read: Cheteshwar Pujara: టీమిండియాకు గుడ్ న్యూస్..ఆసీస్ కు చతేశ్వర్ పుజారా!
అలాంటి క్రికెటర్లలో సచిన్ టెండుల్కర్ ఒకరు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెట్ గాడ్ గా లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ( Sachin Tendulkar ) పేరు ఉంది. ఆయన గ్రౌండ్ లోకి దిగాడు అంటే బౌలర్లు బెంబేలెత్తిపోవాలి. ఇప్పటికే… ఎన్నో వేల పరుగులు చేసిన సచిన్ టెండుల్కర్… సెంచరీలు అలాగే హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. అప్పటి పిచ్ లు, అప్పటి బౌలర్ల ధాటికి కూడా టన్నుల కొద్ది పరుగులు చేసిన ఏకైక వీరుడు సచిన్ టెండూల్కర్.
ఎన్నో ఒడి దోడుకులు ఎదుర్కొని మరీ టీమిండియా కు అనేక విజయాలు అందించాడు సచిన్ టెండూల్కర్. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ ను కూడా పాకిస్తాన్ స్టార్ బౌలర్ గజగజ వనికించాడు. అతని బౌలింగ్కు సచిన్ టెండూల్కర్ బొక్కలు కూడా విరిగాయి. ఆ ప్లేయర్ ఎవరో కాదు షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ). ఇతని బౌలింగ్లో బొక్కలు విరిగిన సరే టీమిండియా తరఫున ఆడి విజయాన్ని అందించాడు సచిన్ టెండూల్కర్.
అయితే ఈ విషయాన్ని తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ… ఈ విషయంపై మాట్లాడారు. ఒకానొక సమయంలో పాకిస్తాన్ తో టీమ్ ఇండియా తలపడింది. ఆ సమయంలో నేను అలాగే సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ చేస్తున్నాం అంటూ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. అప్పుడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) బౌలింగ్ చేశాడు.
అయితే అతను వేసిన ఓ బంతి సచిన్ టెండూల్కర్ పక్కటెముకలకు తాకడం జరిగింది. దీంతో సచిన్ టెండూల్కర్ కుప్పకూలాడు. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేస్తానని సచిన్ తల ఊపాడు. ఆ తర్వాత చివరి వరకు ఆడి టీం ఇండియాను గెలిపించాడు అని సచిన్ టెండూల్కర్ పై ప్రశంసలు కురిపించారు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అయితే… మరుసటి రోజు సచిన్ టెండూల్కర్.. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు అంటూ గంగూలీ తెలపడం జరిగింది.
దాంతో ఆసుపత్రికి వెళ్తే… సచిన్ పక్కటెముకల్లో క్రాక్ వచ్చిందని వైద్యులు చెప్పినట్లు గంగూలీ వివరించాడు. దీంతో సచిన్ టెండూల్కర్ కు ప్రథమ చికిత్స అందించారని చెప్పుకొచ్చారు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly). ఇక అప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ అంటే తనకు గౌరవం పెరిగిందని… అలాంటి ఆటగాడు మళ్లీ టీమిండియా కు దొరకడానికి కొనియాడారు.