Big Stories

Narasapuram Assembly constituency : నరసాపురం నాయకుడెవరు? వైసీపీకి షాక్ తప్పదా?

Narasapuram Assembly constituency : నరసాపురం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ఇక్కడ కాపు కమ్యూనిటీ చాలా బలంగా ఉంది. మొత్తం 28 శాతం ఈ సామాజికవర్గం జనాభానే ఉంది. 2014లో ఇక్కడ టీడీపీ గెలవడానికి కారణం జనసేనతో పొత్తు ఉండడమే. 2019లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వైసీపీకి కలిసి వచ్చింది. జనసేన సెకెండ్ పొజిషన్ లో నిలిచింది. మరోవైపు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ రెబల్ గా మారడం ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చింది. మరి ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

- Advertisement -

ముదునూరి ప్రసాద్ రాజు (వైసీపీ గెలుపు) VS బొమ్మిడి నాయకర్ ( జనసేన )
YCP 41%
JSP 36%
TDP 20%
OTHERS 3%

- Advertisement -

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపురం సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు 41 శాతం ఓట్లు సాధించి విజయం సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ 36 శాతం ఓట్లు రాబట్టారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు మాధవ నాయుడు 20 శాతం ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడం ముఖ్యంగా ఈ సెగ్మెంట్ లో వైసీపీకి కలిసి వచ్చింది. దీనికి తోడు జగన్ వేవ్ కూడా ఉండడం మరింత ప్లస్ అయింది. మరి ఈసారి టీడీపీ, జనసేన పొత్తు ఉండడంతో ఈ ఎన్నికల్లో నరసాపురం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

ముదునూరి ప్రసాద్ రాజు ( YCP ) ప్లస్ పాయింట్స్

  • ప్రసాద్ రాజుకు సెగ్మెంట్ లో క్లీన్ ఇమేజ్
  • ప్రసాద్ రాజు నాయకత్వంపై క్యాడర్ లో సంతృప్తి
  • జనంలో తిరుగుతూ కష్టపడుతున్న ప్రసాద్ రాజు
  • చేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీ
  • స్కూళ్లలో మెరుగైన మౌలిక వసతులు

ముదునూరి ప్రసాద్ రాజు మైనస్ పాయింట్స్

  • అర్హులకు టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడం
  • జగనన్న కాలనీ స్కీంలో ఎవరికీ అందని ఇండ్లు
  • నరసాపురం, మొగల్తూరులో డ్రైనేజ్ సమస్యలు
  • నరసాపురంలో డంప్ యార్డ్ లేక ఇబ్బందులు
  • 2019లో డంప్ యార్డుకు హామీ ఇచ్చినా నెరవేరని పరిస్థితి
  • సెగ్మెంట్లో అధ్వాన్న స్థితికి చేరిన రోడ్లు
  • తాగునీటికి చాలా మందికి ఇబ్బందులు
  • నత్తనడకన నరసాపురం-సఖినేటిపల్లి బ్రిడ్జి నిర్మాణం

బొమ్మిడి నాయకర్ ( JSP ) ప్లస్ పాయింట్స్

  • నరసాపురంలో కీలక నేతగా గుర్తింపు
  • ప్రభుత్వ చర్యలపై ఎప్పటికప్పుడు నిరసనగళం వినిపించడం
  • నరసాపురం అభివృద్ధి కోసం ప్రతిపక్షనేతగా పోరుబాట
  • అన్ని సామాజికవర్గాలతో సత్సంబంధాలు
  • ఫస్ట్ అటెంప్ట్ లోనే 36% ఓట్లు సాధించిన నాయకర్

బొమ్మిడి నాయకర్ మైనస్ పాయింట్స్

  • టీడీపీతో పొత్తుతో టిక్కెట్ దక్కుతుందా లేదా అన్న డౌట్లు

బండారు మాధవ నాయుడు ( TDP ) ప్లస్ పాయింట్స్

  • టీడీపీ వేవ్ పైనే నమ్మకం
  • గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి

బండారు మాధవ నాయుడు మైనస్ పాయింట్స్

  • ఓడిన తర్వాత సెగ్మెంట్ లో యాక్టివిటీ తగ్గించడం

ఇక వచ్చే ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

ముదునూరి ప్రసాద్ రాజు VS బొమ్మిడి నాయకర్
YCP 43%
JSP 52%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసాపురంలో జనసేనకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. బొమ్మిడి నాయకర్ కు ఏకంగా 52 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని సర్వేలో తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేకు 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. జనసేనకు ఇక్కడ ఓట్లు రావడానికి కారణం.. అభ్యర్థికి ఉన్న పాజిటివ్ ఇమేజ్. అలాగే కాపు సామాజికవర్గం పవన్ పార్టీకి మద్దతుగా ఉండాలనుకోవడం వంటి సామాజిక సమీకరణాలు కలిసి వస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వంలో నరసాపురంలో అంతగా అభివృద్ధి జరగలేదన్న ప్రజల అభిప్రాయం ఓట్ల రూపంలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని, వీటికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనసేనకు అనుకూలంగా పని చేసే అవకాశం ఉందని సర్వేలో భాగంగా తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి వచ్చే ఓట్ షేర్.. ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్దిపొందుతున్న వారి ఓట్లు ప్రభుత్వానికి కీలకం కాబోతున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ రాజుపై జనంలో ఉన్న పాజిటివ్ ఇమేజ్ కూడా కలిసి వస్తోంది.

ముదునూరి ప్రసాద్ రాజు VS బండారు మాధవ నాయుడు
YCP 44%
TDP 49%
OTHERS 7%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైసీపీ నుంచి ప్రసాద్ రాజు, టీడీపీ నుంచి బండారు మాధవ నాయుడు పోటీ చేస్తే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ప్రసాద్ రాజుకు 44 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 49 శాతం ఓట్లు, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిజానికి జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికి ఇక్కడ టిక్కెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ జనసేనను కాదని టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపితే బొమ్మిడి నాయకర్ ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారన్న ప్రచారం సెగ్మెంట్ లో జరుగుతోంది. అయితే నరసాపురం టీడీపీ ఇంఛార్జ్ పోతూరు రామరాజు.. జనసేన నేత బొమ్మిడి నాయకర్ తో కలిసి గ్రౌండ్ లో యాక్టివ్ గా ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News