BigTV English

India Vs England 2nd Test:  అంపైర్‌తో ఒకరు అలా.. ఒకరు ఇలా!

India Vs England 2nd Test:  అంపైర్‌తో ఒకరు అలా.. ఒకరు ఇలా!

India Vs England : విశాఖపట్నంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అంపైర్లతో టీమ్ ఇండియా ప్లేయర్ల మాటలు ఒకసారి వివాదాస్పదంగా, ఒకసారి ఛలోక్తిగా మారుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, రెండోరోజు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది.


జో రూట్‌ (5)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టోకు మరో అద్భుతమైన యార్కర్‌ను విసిరాడు. అది బెయిర్ స్టో ప్యాడ్లకు నేరుగా తగింది. దీంతో అవుట్‌ అని టీమ్ ఇండియా ప్లేయర్లు అపీలు చేశారు. కానీ అంపైర్  నాటౌట్‌ అన్నాడు. ఈ సందట్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఒక్క సింగిల్ తీసేశారు.

రోహిత్ శర్మ బుమ్రాతో మాట్లాడాడు. తర్వాత కీపర్‌తో చర్చించాడు. మిగిలిన వారిని రివ్యూకి వెళదామా? వద్దా? అని అడిగాడు. మొత్తానికి అడగలేదు. ఈ లోపు తన పక్కనే ఉన్న అంపైర్‌తో రోహిత్ సరదాగా మాట్లాడాడు.


‘ఈ విషయంలో నీ ఒపినీయన్ ఏమిటి? ‘ అని అంపైర్‌ను సరదాగా అడిగాడు. అప్పటికీ సమీక్ష కోరే గడువు ముగియడంతో ‘లెగ్ బై’ అని బదులిచ్చాడు. దీంతో గ్రౌండ్ లో నవ్వులు విరిశాయి.

కానీ దీనికి రివర్స్‌గా మొదటిరోజు ఒక సంఘటన జరిగింది. టీమ్ ఇండియా బ్యాటింగ్ సందర్భంలో అశ్విన్ బ్యాటింగ్‌కి వచ్చాడు. జైశ్వాల్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. బహుశా తనకి సూచనలు ఏమైనా చేయమని ద్రవిడ్ చెప్పాడేమో తెలీదు. దాంతో రన్ రన్‌కి మధ్య క్రీజులోంచి వెళుతూ జైశ్వాల్‌తో మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో మ్యాచ్ అయిన తర్వాత అంపైర్ తనకి ఒక హెచ్చరిక చేశాడు.

జైశ్వాల్‌తో ఎక్కువగా మాట్లాడవద్దని తెలిపాడు. దీంతో అశ్విన్‌కి కోపం వచ్చింది. తనకి కూడా రూల్ బుక్ అంతా తెలుసు కాబట్టి, ఏ కారణం చేత, తనతో మాట్లాడకూడదో చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇది వివాదాస్పదంగా మారింది.

అయితే కొందరు ఏమంటారంటే, లైట్ లేదని మ్యాచ్‌ని ముందుగానే ముగించారు. లైట్ ఉంది కదా? ఎందుకు క్లోజ్ చేశారని సీరియస్ అయినట్టు వార్తలు వచ్చాయి. విషయం ఏమిటి? అనేది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు.

Related News

S J Suryah: టీమిండియా బౌలర్ ను అవమానించిన టాలీవుడ్ విలన్

Dhoni Fan Died: ఐపీఎల్ 2026 కంటే ముందే CSK జట్టులో పెను విషాదం!

Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్

Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !

Sachin Tendulkar: సారా స్నేహితురాలినే గోకిన అర్జున్… సచిన్ కొడుకు ఇంత కామాంధుడా?

Cristiano Ronaldo :పెళ్లికి ముందే 4 గురు పిల్లలు ఉన్నారా.. బయటపడ్డ రోనాల్డో భాగోతం!

Big Stories

×