BigTV English

Pedana Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పెడనలో ఏ కులం ఎవరివైపు ?

Pedana Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పెడనలో ఏ కులం ఎవరివైపు ?
Andhra pradesh today news

Pedana Assembly Constituency(Andhra pradesh today news):


పెడన.. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొత్త నియోజకవర్గంగా అవతరించింది. నిన్నా మొన్నటి వరకు పెడన టికెట్‌ కోసం జరిగిన పంచాయితీ అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో గెలిచిన జోగి రమేష్‌ను వైసీపీ అధిష్టానం పెనమలూరుకు పంపడంతో వైసీపీలో జరిగిన అంతర్గత పోరుకు కాస్త చల్లబడినట్టే కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో కాపు, గౌడ సామాజికవర్గాలదే హవా అని చెప్పాలి. గత ఎన్నికల్లో గౌడ కులస్తులనే బరిలోకి దింపాయి వైసీపీ, టీడీపీ పార్టీలు. ఈసారి కొత్త అభ్యర్థి రాముకు వైసీపీ టికెట్ కేటాయించగా.. టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన కాగిత కృష్ణ ప్రసాద్‌కే మరోసారి టికెట్‌ కేటాయించే అవకాశం ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరి బలాలేంటి? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అనే దానిపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.

2019 RESULTS


జోగి రమేష్ (గెలుపు) vs కాగిత కృష్ణ ప్రసాద్

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున జోగి రమేష్‌ పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 42 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంతో భారీ సంఖ్యలో ఓట్లు చీలాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్‌కు 37 శాతం ఓట్లు పోలయ్యాయి. తండ్రి కాగిత వెంకట రావు చరిష్మా, టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ ఆయనకు అండగా నిలిచింది. అయితే ఆయన కేవలం స్వల్ప మార్జిన్‌తో ఓటమిని చవి చూశారు. జనసేన తరపున అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌ పోటీ చేసి ఏకంగా 17 శాతం ఓట్లు సంపాదించారు. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక ఓట్లు ఆయనకే పడ్డాయి. అంతేకాదు ఆయన సొంత సామాజిక వర్గమైన గౌడ సామాజిక ఓటర్లు కొంత మంది కూడా ఆయనకు మద్ధతుగా నిలిచారు. దీంతో భారీ సంఖ్యలో ఓట్లు చీలాయి. మరి ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతుండటం.. జోగి రమేష్‌ పెనమలూరుకు వెళ్లడంతో ఎవరి గెలుపుకు ఎక్కువ అవకాశముంటోంది అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూద్దాం.

ఉప్పాల రాము (YCP) ప్లస్ పాయింట్స్‌

కలిసి రానున్న తండ్రి రాజకీయ నేపథ్యం
నియోజకవర్గంలో చాలా రోజులుగా యాక్టివ్‌గా ఉండటం

ఉప్పాల రాము మైనస్‌ పాయింట్స్‌

క్యాడర్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు
పథకాల అమలు తప్ప నియోజకవర్గంలో జరగని అభివృద్ధి
నెరవేరని ఎన్నికల హామీలు
గ్రామాల్లో ఆశించినంత జరగని అభివృద్ధి

కాగిత కృష్ణ ప్రసాద్‌ (TDP) ప్లస్ పాయింట్స్

నియోజకవర్గంలో చాలా యాక్టివ్‌గా ఉండటం
ప్రభుత్వ లోపాలను సమర్థవంతంగా ఎత్తి చూపడం
కలిసి రానున్న ప్రభుత్వ వ్యతిరేకత
కలిసి రానున్న తండ్రి రాజకీయ నేపథ్యం
కలిసి రానున్న జనసేనతో పొత్తు

పెడన నియోజకవర్గంలో కాపులు, గౌడ్‌లు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 31 శాతం కాపులు ఉన్నారు. వీరే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వీరిలో వైసీపీకి 45 శాతం మద్ధతు ఇస్తుండగా.. టీడీపీ కూటమికి 50 శాతం మంది మద్ధతు పలుకుతున్నారు. 2019 ఎన్నికల్లో వీరి ఓట్లు ఎక్కువగా జనసేనకే పడ్డాయి. ఈ సారి జనసేన టీడీపీతో కూటమిలో ఉండటంతో వారి ఓట్లు ఆ పార్టీకే పడనున్నాయి. అయితే కాపు నేస్తం లబ్ధిదారులు మాత్రం వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. 5 శాతం మంది మాత్రం ఇతర పార్టీలకు ఓటు వేయనున్నారు. కాపుల తర్వాత అధిక సంఖ్యలో గౌడ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. మొత్తం 28 శాతం ఉన్న ఓటర్లలో వైసీపీ, టీడీపీ కూటమికి సమంగా అంటే 45 శాతం మద్ధతు పలుకుతున్నారు. మిగిలిన 10 శాతం మంది ఇతరులకు మద్ధతిస్తున్నారు. రెండు పార్టీలు కూడా ఈ సామాజిక వర్గ నేతలకు సమ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు సామాజిక వర్గాల తర్వాత ఎస్సీ మాలలు 13 శాతం ఉన్నారు. వీరిలో అధికంగా అంటే 55 శాతం మంది వైసీపీకి మద్దతు పలుకుతుండగా.. 40 శాతం మంది టీడీపీ కూటమికి మద్ధతిస్తున్నారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారులు అధికంగా వైసీపీకే జై కొడుతుండగా.. మిగిలినవారు టీడీపీకి మద్ధతిస్తున్నారు. మిగిలిన ఐదు శాతం మంది మాత్రం ఇతరులకు మద్ధతు పలుకుతున్నారు. ఇక 8 శాతం ఉన్న మత్స్యకారుల్లో వైసీపీకి 50 శాతం, టీడీపీ కూటమికి 40 శాతం, ఇతరులకు 10 శాతం మద్ధతు పలుకుతున్నారు. మత్స్యకార వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో ఆ సామాజిక వర్గ నేతలకు సరైన పదవులు దక్కడంతో చాలా మంది వైసీపీకి సానుకూలంగా ఉన్నారు. అయితే టీడీపీకి కూడా సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు. ఇక 7 శాతం ఉన్న దేవాంగ సామాజిక వర్గంలో వైసీపీకి 40 శాతం, టీడీపీ కూటమికి 55 శాతం మద్ధతు పలుకుతున్నట్టు బిగ్ టీవీ సర్వేలో తేలింది.

ఇక వచ్చే ఎన్నికల్లో పెడన నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో చూస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ తరపున బరిలోకి దిగే ఉప్పాల రాముకు 42 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. అయితే టీడీపీ నుంచి కాగిత కృష్ణ ప్రసాద్ బరిలోకి దిగితే మాత్రం 51 శాతం ఓట్లు పోలవుతాయని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఇతరులకు 7 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. పెడనలో జరిగే వారసుల పోరులో గెలిచేది టీడీపీనే అని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×