Interfaith Marriage Murder| హిందువు మతం ఆచరించే ఓ 19 ఏళ్ల కుర్రాడిని ఇద్దరు యువకులు కత్తితో దారుణంగా పొడిచి చంపేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. చనిపోయిన కుర్రాడు ఇతర మతానికి చెందిన ఓయువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ కారణంగానే అతడిని హత్య చేశారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని గోకుల్ పురి సంజయ్ కాలనీక ిచెందిన హిమాన్షుకు అనే 19 ఏళ్ల కుర్రాడిని ఇద్దరు ముస్లిం యువకులు షారుఖ్, సాహిల్ అనే పేరు గల ఇద్దరు యువకులు కత్తులతో పొడిచి చంపారు. అయితే వారిద్దరూ దాడి చేసే ముందు హిమాన్షు ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహించారు. ఆ తరువాత మాటు వేసి హిమాన్షుపై రాత్రి వేళ దాడి చేశారు. దాడి జరిగిన తరువాత హిమాన్షు కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో గోకుల్ పురి పోలీస్ స్టేషన్
ఏప్రిల్ 7 2025 రాత్రి 9 గంటల సమయంలో హిమాన్షు నివసించే సంజయ్ కాలనీలో ఈ దాడి జరిగింది. ఆ సమయంలో కాలనీలోని సిసిటీవి వీడియోల ఆధారంగా పోలీసులు హంతకులను గుర్తుపట్టారు. వారిద్దరిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం 103 (1)/ 3(5) ప్రకారం.. కేసు నమోదు చేశారు. పోలీసులు హంతకులు సాహిల్ ఖాన్ (22), షారుఖ్ ఖాన్ (19)ని సీసిటివి వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. వీరు కూడా సంజయ్ కాలనీలోనే నివసిస్తున్నారని.. స్థానికులు తెలిపారు.
Also Read: పొలంలో సూట్ కేసు.. అందులో శవం.. భర్త మేనల్లుడిని ప్రేమించిన యువతి..
పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడు హిమాన్షుకు హంతకులతో ముందే పరిచయం ఉందని తేలింది. చనిపోయిన హిమాన్షు తండ్రి జోగిందర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాన్షు ఒక ముస్లిం యువతిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం బయటికి రావడంతో యువతి కుటుంబ సభ్యులు గొడవలు చేశారు. ఆ తరువాత యువతి సోదరులు సాహిల్, షారుఖ్ ఇద్దరూ కలిసి హిమాన్షుని హత్య చేసేందుకు.. హిమాన్షు ఇంటికి వచ్చి బయటకు రమ్మన్నారు. ఆ తరువాత అతడిని పొడిచి చంపారు. ప్రస్తుతం హిమాన్షుతో పెళ్లి చేసుకున్న యువతి ఆమె పుట్టింట్లోనే ఉంది. కానీ ఆమె కూడా ఈ హత్య కేసులో నిందితురాలని హిమాన్షు తండ్రి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఈ హత్యలో యువతి పాత్ర ఉందా? లేదా? అనే కోణంలో ఇంకా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.