BigTV English

OG Trailer Late : ట్రైలర్ లేట్ అవ్వడానికి కారణం DI, AI కాదు… అంతా ప్రశాంత్ వర్మనే

OG Trailer Late : ట్రైలర్ లేట్ అవ్వడానికి కారణం DI, AI కాదు… అంతా ప్రశాంత్ వర్మనే


Reason Behind OG Trailer Delay: పవన్కళ్యాణ్మోస్ట్అవైయిటెడ్చిత్రం ఓజీ (OG Movie Trailer) ట్రైలర్అంటే… 21 సెప్టెంబర్ రోజు రిలీజ్ కావాల్సింది. డేట్ ఒక్కటే కాదు… 21న ఉదయం 10:08 గంటలకు ట్రైలర్ రిలీజ్ ఉంటుందని స్వయంగా నిర్మాతలు డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ తో అనౌన్స్ చేశారు. ట్రైలర్ టైం.. ట్రైలర్‌కి రెడీ అంటూ ఇంకా ఏవేవో ట్వీట్స్ కూడా వేశారు. కానీ, అనుకున్న టైంకి.. మాట ఇచ్చిన టైంకి ట్రైలర్ రాలేదు. పోని, సాయంత్రం ఈవెంట్ ఉంది కదా.. అప్పుడు వస్తునుకున్నారు. ప్రీ రిలీజ్ఈవెంట్కి పవన్ కళ్యాణ్ వచ్చాడు.. ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారని అనుకున్నారు.

ట్రైలర్ఎందుకు ఆలస్యమైంది..

కానీ, అప్పుడూ అవ్వలేదు. ఈవెంట్‌లో ట్రైలర్ గురించి డైరెక్టర్ సుజిత్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. అప్పుడైనా ఈవెంట్ కంప్లీట్ అయ్యకా రిలీజ్ చేస్తారేమో అనుకుంటే.. అది అవ్వలేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల కోపం కట్టలు తెచ్చుకుంది. నిర్మాతలను దారుణంగా తిట్టారు. ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఇప్పుడు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. దాన్ని చూసిన తర్వాత పవన్ అభిమానుల నుంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. అయితే దీన్ని పక్కన పెడితే, ట్రైలర్ రిలీజ్ తర్వాత కూడా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై పవన్ ఫ్యాన్స్ కోపం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే పెరిగింది. ఎందుకంటే, ట్రైలర్ చివరలో ఉన్న వేరే మూవీ పోస్టర్. ఆ మూవీ పేరు ఆధీర. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రెండో సూపర్ హీరో మూవీగా వస్తుంది అధీర.


ఎడిటింగ్‌, డీఐ, ఏఐ కాదు..

దాంట్లో సూపర్ హీరో ఎవరంటే.. ఇప్పుడు ఓజీ మూవీని నిర్మిస్తున్న దాసరి కళ్యాణ్. ఈయన బడా నిర్మాత డీవీవీ దానయ్యకు సొంత కుమారుడు. ఈ మూవీ పోస్టర్‌ను ఓజీ ట్రైలర్‌ ఎండింగ్చూపించారు. అది అందరూ చూశారు. అయితే, ట్రైలర్ లేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇదే అయి ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతే కాదు… ప్రశాంత్ వర్మపై, డీవీవీ దానయ్యపై, దాసరి కళ్యాణ్‌పై ఫైర్ అవుతున్నారు. మీ సినిమా కోసం.. ఓజీ ట్రైలర్‌ను ఆలస్యం చేస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా భగ్గమంటున్నారు. ఎందుకంటే ముందు నుంచి ఆ పోస్టర్ సడన్‌గా రెడీ చేశారని, దాని ఎడిటింగ్ లేట్ అయి ఉండొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచే రావడం గమనార్హం.

Also Read: OG Trailer: పేల్చిపడేస్తాం… ట్రైలర్ లేట్ అయితే సారీ చెప్పలేదు కానీ..!

ప్రశాంత్వర్మ వల్లే..

ఇది పక్కన పెట్టి ట్రైలర్ గురించి థింక్ చేయాలని అనుకున్నా… ట్రైలర్‌లో హీరో పవన్ కళ్యాణ్ కంటే, విలన్ ఇమ్రాన్ హస్మీ నే ఎక్కువ హైలైట్ అయ్యాడు. అది పవన్ కళ్యాణ్ అభిమానులకు మరింత కోపం తెప్పించే కారణం అవుతుంది. టీజర్ సూపర్బ్ గా కట్ చేశారు. అప్పుడు సినిమా యూనిట్ మొత్తానికి మంచి మార్కులు పడ్డాయి. కానీ, ఇప్పుడు ట్రైలర్ వచ్చాకా.. అదే మూవీ యూనిట్‌పై సెటైర్లు పడుతున్నాయి. ఇంత టైం తీసుకున్నా… మంచి ట్రైలర్ కట్ ఇవ్వలేకపోయారు అంటూ ఫ్యాన్స్ విసుక్కుంటున్నారు. ఏది ఏమైనా… పవన్ కళ్యాణ్ రేంజ్‌కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఫస్ట్ డే 100 కోట్ల కలెక్షన్లు వచ్చినా… ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఫ్యాన్స్ నుంచి కొంత మంది క్రిటిక్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది నిజం అవుతుందో లేదో తెలియాలంటే 25 వరకు వెయిట్ చేయాల్సిందే.

Related News

‎OG Censor : ‘ఓజీ’ ఇట్స్ A సర్టిఫికేట్ మూవీ… అయినా రెండు నిమిషాలు కట్ చేశారు

Dharma Wife: రాత్రిళ్ళు మాత్రమే ఫ్లాట్‌కి వస్తుంది.. క్యారెక్టర్ లేదా? రీతు చౌదరిపై ధర్మా భార్య గౌతమి ఫైర్!

‎Bhagyashri Borse : నువ్వుంటే చాలు… రామ్‌ కోసం భాగ్యశ్రీ కూని రాగం… రిలేషన్ కన్ఫామా ?

Naina Ganguly: కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడు… అందుకే ఇండస్ట్రీకి దూరం

‎Ranbir Kapoor: రణబీర్ కపూర్ కు షాక్ ఇచ్చిన ఎన్ హెచ్ఆర్సీ… చర్యలు తీసుకోవాలంటూ!

Balayya: బాలయ్య తెల్లవారుజాము 3 గంటలకు నిద్రలేచి చేసే పని ఇదేనట, వామ్మో!

OG Fever: ఓం.. ఓజాస్ గంభీరాయనమః… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వైరల్ ఫీవర్

Big Stories

×