Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే(Bhagya Shri Borse) .. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ట్రెండింగ్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. గత ఏడాది రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించి ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది. అంతేకాకుండా ఈ సినిమాతో యూత్లో భారీగా కూడా ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకుంది. ఆ తర్వాత ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని సినిమాల కథలు కూడా విన్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈమెకు అలాగే టాలీవుడ్ హీరో రామ్ పోతినేనికి మధ్య ఏదో జరుగుతోంది అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇలా రిలేషన్షిప్ వార్తలు వినిపిస్తున్న సమయంలో భాగ్యశ్రీ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రామ్ రాసిన పాట..
అదేమిటంటే.. రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా నటిస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra King Thalukaa). ఈ సినిమాలో “నువ్వుంటే చాలే” అనే పాటను స్వయంగా హీరో రామ్ పోతినేని పాడిన విషయం తెలిసిందే. ఈ పాటకు హీరో రామ్ పోతినేని లిరిక్స్ అందించగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాటను పాడారు. అయితే తాజాగా ఈ పాటను హీరోయిన్ భాగ్యశ్రీ పాడడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Can't get enough of #NuvvunteChaley ❤️🔥
The beautiful #BhagyashriBorse grooving to the blockbuster melody from #AndhraKingTaluka 😍
Lyrics by Energetic Star @ramsayz
Music by @iamviveksiva & @mervinjsolomon
Sung by @anirudhofficial#AKTonNOV28… pic.twitter.com/J6l8z6Kwid— Ramesh Bala (@rameshlaus) September 22, 2025
రిలేషన్ కన్ఫామా..
తన అద్భుతమైన గాత్రంతో పాటను ఆలపించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భాగ్యశ్రీ కావాలనే ఈ పాట పాడిందా? రామ్ తో ప్రేమలో ఉన్నట్టు ఈ పాటతో హింట్ ఇచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియోతో మరోసారి వీరిద్దరి రిలేషన్షిప్ వార్తలు వైరల్ గా మారాయి. మరి ఈ వార్తలపై హీరో రామ్ పోతినేని అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. కాగా హీరో రామ్ కూడా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో రామ్ నటించిన సినిమాలు ఏవి అభిమానులను మెప్పించలేకపోతున్నాయి. మరి ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.
Also Read: Ranbir Kapoor: రణబీర్ కపూర్ కు షాక్ ఇచ్చిన ఎన్ హెచ్ఆర్సీ… చర్యలు తీసుకోవాలంటూ!