Tirumala News: తిరుమల భక్తులకు శుభవార్త. పెరుగుతున్న రద్దీ, ఆపై భక్తుల సౌకర్యార్థం కొరకు కొత్త నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇకపై తిరుపతి నుంచి కాలి నడకన వచ్చే భక్తుల కోసం ఉచితంగా బస్సులు నడపాలని భావిస్తోంది. అదే జరిగితే శ్రీవారి భక్తులకు కాస్త ఉపశమనం అని చెప్పవచ్చు.
భక్తులకు త్వరలో శుభవార్త
తిరుపతి నుంచి తిరుమలకు ప్రతీ రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. బస్సుల కంటే కాలినడకకు ఎక్కువ మంది ప్రయార్టీ ఇస్తుంటారు. తిరుపతి రైల్వేస్టేషన్, బస్సు స్టేషన్ నుంచి అలిపిరి, శ్రీవారి మెట్ల వరకు భక్తులు తరలి వస్తుంటారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల దగ్గరకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు.
భక్తులకు ఇది కాస్త ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. పరిస్థితి గమనించిన టీటీడీ, కొండపై భక్తుల కోసం ఉచితంగా బస్సులు నడుపుతున్నాము. తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ నుంచి కాలినడకన వెళ్లే భక్తుల కోసం అలిపిరి, శ్రీవారి మెట్టు వరకు ఉచితంగా బస్సులను నడపాలని భావిస్తోంది టీటీడీ.
కొత్తగా 20 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి రైల్వేస్టేషన్, బస్సుస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: అన్నదాత స్కీమ్ పై బిగ్ అప్ డేట్, రూ. 20 వేలకు సిద్ధకండి
టీటీడీ ఆధ్వర్యంలో ఉచితంగా ధర్మ రథం పేరిట బస్సులను ఏర్పాటు చేసింది. పెరుగుతున్న రద్దీకి బస్సులు ఏ మాత్రం చాలడం లేదు. త్వరలో పాలకమండలి సమావేశంలో దాతల సహకారంతో ఈ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. అయితే ఉచిత బస్సులపై అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.
ప్రస్తుతం మూడు బస్సులు మాత్రమే
ప్రస్తుతం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి శ్రీవారి మెట్టుకు మూడు ఉచిత బస్సులను నడుపుతోంది టీటీడీ. ప్రస్తుతం ప్రతీ రోజూ ఉదయం 5 గంటల నుండి బస్సులు మొదలవుతాయి. సాయంత్రం 6.15 గంటల వరకు బస్సులు నడుస్తున్నాయి. ప్రతీ 45 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. దాదాపు 18 ట్రిప్పులు తిరుగుతున్నాయి. శ్రీవారి మెట్టు నుంచి వచ్చే భక్తులకు చివరి బస్సు రాత్రి 7.15 గంటలకు ఉంటుంది. టీటీడీ నడుపుతున్న ఈ ఉచిత బస్సు సేవలు భక్తులు ఉపయోగించుకోవాలని చెబుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ఒకటి ఉచిత వివాహాలను నిర్వహిస్తోంది. తిరుమలలో పాప వినాశనం రోడ్డులోవున్న కళ్యాణ వేదిక వద్ద ఉచిత వివాహాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి మాంచి స్పందన వస్తోంది.
వివాహం తర్వాత పెండ్లి కొడుకు-పెండ్లికూతురితోపాటు వారి తల్లిదండ్రులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తోంది. ఏటీసీ వద్ద ఉన్న రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఉచితంగా అనుమతిస్తారు. దర్శనం పూర్తి చేసుకున్న దంపతులు, వారి పేరెంట్స్‌కు ఒక్కొక్కరికి ఒక్కో తిరుమల లడ్డూ ఉచితంగా అందజేయనుంది.