OG Censor: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలు, మరొకవైపు రాజకీయాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు ఈయన కమిట్ అయిన సినిమా పనులను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇక త్వరలోనే సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. అలాగే ఇమ్రాన్ హాష్మి విలన్ గా కనిపించనున్నారు. శ్రీయా రెడ్డి కీలక పాత్రలో ఆకట్టుకోనున్నారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 25న ఈ మూవీ భారీగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రైలర్ అదిరిపోయింది అంటూ ట్రైలర్ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేమిటంటే తాజాగా ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు మూవీకీ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
ఆ సీన్స్ డిలీట్..
అలాగే ఈ సినిమాలో కొన్ని హింసాత్మక, అభ్యంతర సన్నివేశాలను సైతం డిలీట్ చేశారు. 1: 55 నిడివి ఉన్న సన్నివేశాలను ఈ సినిమా నుంచి తొలగించేశారు. అలా తొలగించగా ఈ సినిమా మొత్తం నిడివి చివరకు 154 ని 15 సెకండ్లు ఉంటుందని సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ లో తెలిపారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘ ఏ ‘ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు అంటూ రెండు నిమిషాల సన్నివేశాలను డిలీట్ చేయడం ఇప్పుడు ఆశ్చర్య పరుస్తోంది. ఇక ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఏ సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల 18 సంవత్సరాల వయసు కలిగిన వారు సినిమా చూడటానికి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు. పవన్ కళ్యాణ్ అభిమానులలో 18 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నవారు అధికంగా ఉన్నారని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయవంతంగా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సెప్టెంబర్ 25న థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Bhagyashri Borse : నువ్వుంటే చాలు… రామ్ కోసం భాగ్యశ్రీ కూని రాగం… రిలేషన్ కన్ఫామా ?