Dharma Wife: జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం ద్వారా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది రీతూ చౌదరి (Rithu Chowdhary) . సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) లోకి అడుగుపెట్టిన రీతూ చౌదరి.. గుట్టు రట్టు చేస్తూ ప్రముఖ హీరో ధర్మ మహేష్ (Dharma Mahesh) భార్య ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి (Gautami Chowdhary) బయటపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ హీరో ధర్మ మహేష్ వరకట్నం కోసం తనను వేధిస్తున్నాడని, మరో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడని.. కొద్ది రోజుల క్రితమే ఆయన భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో గౌతమి ఆ అమ్మాయి పేరును బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఫోటోలు, వీడియోలతో పాటు వాట్స్అప్ చాట్ కూడా స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా గౌతమి విడుదల చేసిన వీడియోలలో బిగ్ బాస్ ఫేమ్ రీతు చౌదరి కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
13 ఏళ్ల మా బంధంలో చిచ్చు పెట్టింది..
ఇదిలా ఉండగా తాజాగా గౌతమి.. బిగ్ టీవీ ఛానెల్ కి ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ..” 13 ఏళ్ల బంధానికి రీతూ చౌదరి అడ్డుకట్ట వేసింది” అంటూ ఆరోపణలు చేసింది గౌతమి మాట్లాడుతూ.. “ధర్మా మహేష్, నేను ప్రేమించుకొని, పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాము. పెళ్లి తర్వాత కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. అయితే 2023లో నేను గర్భం దాల్చాను. అదే సమయంలో కాస్త బరువు పెరిగిపోయాను. అప్పుడే రీతూ చౌదరి మహేష్ కి పరిచయమయ్యింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్ కి వచ్చేది. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మహేష్ నా ముఖం మీద నువ్వు చాలా బరువు పెరిగి పోయావు.. నీపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విధంగా ముఖం మీద చెప్పేసరికి తట్టుకోలేకపోయాను.
రాత్రిళ్లు మాత్రమే మా ఫ్లాట్ కి వస్తుంది..
ముఖ్యంగా రీతు చౌదరి నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్మెంట్ అయింది. ప్రతిరోజు రాత్రిళ్ళు మాత్రమే ఆమె మా ఫ్లాట్ కి వచ్చేది. అసలు నా ఫ్లాట్ కి రావాల్సిన అవసరం ఆమెకు ఏముంది? నేను సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చాను. నిజానికి అది నా ఫ్లాటు.. అక్కడ ఏం చేసే అవకాశం అయినా నాకు ఉంటుంది. అలాంటిది నా పర్మిషన్ లేకుండా ఉదయం పూట రాకుండా కేవలం రాత్రులు మాత్రమే నా ఫ్లాట్ కి వస్తోంది అంటే నేను ఏమని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరో ఆశ్చర్యం ఏమిటంటే.. ఆమె కోసం ఒకానొక సమయంలో నన్ను ఆ ఫ్లాట్ నుంచి కూడా మహేష్ బయటకు పంపాడు.. ఆమె వల్లే మా మధ్య విభేదాలు మొదలయ్యాయి.. ముఖ్యంగా వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో కూడా నేను చెప్పలేను. ఇప్పటికి నేను ధర్మ మహేష్ ని కోరుకుంటున్నాను.. నా కొడుకుకి తండ్రిగా కావాలనుకుంటున్నాను. కానీ అతడు మాత్రం మమ్మల్ని దూరం పెడుతున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికైతే గౌతమి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తన బాధను వెళ్ళబుచ్చింది. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో రీతూ చౌదరిపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు.
Also read: Priyanka Mohan: చంద్రముఖిలా మారిన ప్రియాంక.. ఆ ఎక్స్ప్రెషన్స్ చూశారా?