USA: అమెరికాన్‌లోని ఓ భారతీయ మహిళ దుండగుడి కాల్పుల్లో మరణించింది. గుజరాత్‌కు చెందిన మహిళ కిరణ్ పటేల్(49) యుఎస్ లోని సౌత్ ఫిక్ని స్ట్రీట్‌లో డీడీస్ ఫుడ్ మార్ట్‌ను నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే రాత్రి షాపును క్లోజ్ చేయడానికి సిద్ధమైంది. అదే సమయంలో దుండగుడు షాపులోకి చొరబడి కిరణ్ పటేల్ పై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.