Pregnant Ladies: వేసవి వేడి ఎక్కువైపోతుంటే, గర్భిణీలకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండటం కొంచెం కష్టమే. వేడి ఎవరికైనా ఇబ్బందే, కానీ గర్భంతో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సులభమైన చిట్కాలతో గర్భిణీలు, కడుపులో ఉన్న బిడ్డ సురక్షితంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడిలో గర్భిణీలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
గర్భంతో ఉంటే రక్తప్రవాహం, జీవక్రియ వల్ల శరీరం ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగానే ఉంటుందట. దానికి తోడు వేడి వాతావరణం అయితే, శరీరం త్వరగా వేడెక్కినట్లు అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి వల్ల నీరసం, అలసట, లేదా హీట్ ఎగ్జాస్టన్ వచ్చే ప్రమాదం ఉందట. ఇవి ముందస్తు సంకోచాలు లేదా తలతిరగడానికి దారితీయొచ్చు. చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.
ముందుగా, నీళ్లు బాగా తాగాలి. రోజుకి 8–10 గ్లాసులు, చెమట ఎక్కువైతే ఇంకా ఎక్కువ. ఎప్పుడూ నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లి, దాహం లేకపోయినా సిప్ చేస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటివి తినండి, ఇవి నీళ్లనూ, పోషకాలనూ అందిస్తాయట. చక్కెర డ్రింక్స్, కెఫిన్ వాడొద్దు, ఇవి నీటిని తగ్గిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
వేడి ఎక్కువగా ఉండే సమయంలో, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇంట్లోనే ఉండడం ఉత్తమం. ఏసీ లేకపోతే, లైబ్రరీ, మాల్, కమ్యూనిటీ సెంటర్ వంటి చల్లని చోట్లకు వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఫ్యాన్ వాడాలి, కర్టెన్లు మూసి ఉంచాలి. చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. కాటన్, లినెన్‌తో చేసిన సౌకర్యవంతమైన బట్టలు వేసుకోవడం మంచిది.
బయటకు వెళ్లాల్సి వస్తే, నీడలోనే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వైడ్ బ్రిమ్ టోపీ లేదా గొడుగు వాడడం మంచిది. SPF 30 ఉండే సన్‌స్క్రీన్ రాసుకోవాలి, సన్‌బర్న్ అయితే ఇంకా వేడిగా అనిపిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం వేడి తక్కువగా ఉన్నప్పుడు బయటి పనులు చేసుకోవడం ఉత్తమం.
గర్భం సమయంలో ఎక్కువ అలసటగా ఉంటుంది, వేడి దీన్ని ఇంకా పెంచుతుంది. తరచూ విశ్రాంతి తీసుకోవాలి. తలతిరగడం, వాంతి, తలనొప్పి వస్తే, అవి వేడి ఒత్తిడి సంకేతాలు కావచ్చు. చల్లని చోట కూర్చుని నీళ్లు తాగండి, లక్షణాలు తగ్గకపోతే డాక్టర్‌ని సంప్రదించడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
చిన్న చిన్న భోజనాలు తరచూ తినండి, ఇవి శక్తినిస్తాయట. కడుపు భారంగా అనిపించకుండా ఉండాలంటే సలాడ్, పెరుగు, గ్రిల్డ్ కూరగాయలు తినడం మంచిది. వేయించిన, కారంగా ఉన్న ఆహారాలు మానుకోవాలి. ఇవి వేడిని పెంచుతాయి.
గర్భంతో కాళ్లు, చీలమండలు వాపు సాధారణం, వేడితో ఇది ఇంకా ఎక్కువవుతుంది. చల్లని నీళ్లలో కాళ్లు నానబెట్టండి లేదా చల్లని కంప్రెస్ వాడాలని నిపుణులు చెబుతున్నారు. చల్లని చోట నడక లేదా ప్రినేటల్ యోగా రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయట.
ప్రినేటల్ చెకప్‌లు మిస్ చేయొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. వేడి కొన్ని లక్షణాలను దాచేస్తుందట. కాబట్టి రెగ్యులర్ చెకప్‌లు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ కదలికలు తగ్గడం, తీవ్రమైన తలనొప్పి, ఒక్కసారిగా వాపు వంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.