BigTV English

Venkatagiri Assembly Constituency: బిగ్ టీవీ సర్వే.. వెంకటగిరిలో విక్టరీ కొట్టేదెవరు..?

Venkatagiri Assembly Constituency: బిగ్ టీవీ సర్వే.. వెంకటగిరిలో విక్టరీ కొట్టేదెవరు..?

Big TV Survey in Venkatagiri Assembly Constituency: ఏపీ రాజకీయాల్లో వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి గెలిచిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా 1990 నుంచి 1992 మధ్య పని చేశారు. మాజీ క్రికెటర్ భారతరత్న సచిన్ టెండూల్కర్ ఇదే నియోజకవర్గంలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని 2014 నవంబర్ లో దత్తత తీసుకున్నారు. వెంకటగిరి చీరలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఏపీనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సెగ్మెంట్ లో ఆనం కుటుంబానికి పట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయన్ను వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. మరి వెంకటగిరి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

ఆనం రామనారాయణ రెడ్డి VS కురుగుండ్ల రామకృష్ణ


2019 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరిలో వైసీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ నుంచి రామకృష్ణ బరిలో నిలవగా.. వైసీపీ అభ్యర్థి 57 శాతం ఓట్లు సాధించి ఘన విజయం నమోదు చేసుకున్నారు. అలాగే టీడీపీ 37 శాతం ఓట్లు రాబట్టింది. ఇతరులకు 6 శాతం ఓట్లు లభించాయి. మరి ఈసారి ఎన్నికల్లో వెంకటగిరి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

వెంకటగిరిలో యాక్టివిటీ పెంచిన రాంకుమార్ రెడ్డి

తల్లిదండ్రుల రాజకీయ వారసత్వం

తండ్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సీఎంగా పని చేయడం

నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మైనస్ పాయింట్స్

జనంలో ఇమేజ్ పెరగకపోవడం

భాస్కర్ సాయికృష్ణ యచేంద్ర (YCP) ప్లస్ పాయింట్స్

వెంకటగిరి వ్యాప్తంగా మంచి గుర్తింపు

గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం

భాస్కర సాయికృష్ణ యచేంద్ర మైనస్ పాయింట్స్

ఎస్వీబీసీ ఛైర్మన్ గా బాధ్యతలతో సెగ్మెంట్ కు దూరం

టిక్కెట్ దక్కితే ప్రత్యర్థికి సవాల్ విసురుతారా అన్న డౌట్లు

కురుగొండ్ల రామకృష్ణ (TDP) ప్లస్ పాయింట్స్

2009-14 మధ్య నియోజకవర్గ అభివృద్ధి

ఇప్పటికీ బలమైన క్యాడర్ సపోర్ట్

కురుగొండ్ల రామకృష్ణ మైనస్ పాయింట్స్

గతంలో కురుగొండ్లపై ఆరోపణలు

చాలా రోజుల తర్వాత సెగ్మెంట్ లో యాక్టివ్

ఆనం రామనారాయణ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

వెంకటగిరి సెగ్మెంట్ లో బలమై నేత కావడం

జనంలో మంచి ఇమేజ్ కలిగి ఉండడం

ఇక వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి VS ఆనం రామనారాయణ రెడ్డి

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి పోటీ చేస్తే 54 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి 42 శాతం ఓట్లు పొందే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక టీడీపీకి గెలుపు అవకాశాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే.. ఇక్కడ గత మూడు ఎన్నికల్లో ఆ పార్టీకి 35 శాతం దాకా ఓట్లు సాధించింది. జనసేన పొత్తు, ఆనం కుటుంబానికి వెంకటగిరిలో ఉన్న వ్యక్తిగత ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఓట్ షేర్ పెరిగేందుకు కారణంగా సర్వేలో వెల్లడైంది. కురుగొండ్ల రామకృష్ణ, బొలిగల మస్తాన్ యాదవ్ సపోర్ట్ కూడా కలిసి వస్తుందంటున్నారు. వైసీపీ ఓట్ షేర్ కు కారణం రామ్ కుమార్ రెడ్డి తండ్రి సీఎంగా పని చేయడం, తల్లి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండడం, భాస్కర సాయికృష్ణ యచేంద్ర సపోర్ట్ ఇవన్నీ వైసీపీ ఓట్ షేర్ కు కారణంగా కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్ సర్కార్ పథకాలతో బెనిఫిట్ పొందిన వారి ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కీలకం కాబోతున్నాయి.

.

.

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×