Big Stories

Balineni Srinivas: రసవత్తరంగా ఒంగోలు టిక్కెట్ పంచాయితీ.. బాలినేనితో చర్చలు ఫలించలేదా ?

AP News live

Balineni Srinivasa Reddy Ready to Leave YSRCP (AP news live):

ప్రకాశం జిల్లా వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ రకంగా అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడినట్ల అయ్యింది. తాను పార్టీలో ఉండాలంటే చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలనే కండీషన్ పెట్టిన బాలినేని.. వైసీపీ అధిష్టానం దానికి అంగీకరించకపోతే.. వైసీపీని వీడతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి అల్లకల్లోల్లమే అంటున్నారు రాజకీయనిపుణులు. దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారీ బుజ్జగించడం, మంతనాలు చేస్తూ వస్తున్నారు. మొన్న సీఎంవోకు వచ్చిన బాలినేని నిమిషాల వ్యవధిలోనే.. కనీసం కారు కూడా దిగకుండానే వెనుదిరగడం, పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలతో అధిష్టానం అప్రమత్తమైంది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను రంగంలోకి దింపి మంతనాలు సాగించింది.

- Advertisement -

ఐదు గంటల పాటు కుటుంబ సభ్యులు, ముఖ్యనేతలతో బాలినేని భేటీ అయ్యి… భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు చేశారు. ఒంగోలు అసెంబ్లీ సీట్ కాదని గిద్దలూరు వెళ్లాలని సీఎం జగన్.. సూచించినట్లు సమాచారం. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని బాలినేనితో పార్టీ నేతలు చెప్పారని తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ అని వైసీపీ పెద్దలు చెప్పేయటంతో సజ్జల భేటీ తరువాత బాలినేని.. మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గెలవటానికి సీఎం ఫోటో చాలు అన్నప్పుడు.. ఈ మార్పులు చేర్పులు ఎందుకని.. సజ్జల రామకృష్ణారెడ్డిని బాలినేని ప్రశ్నించినట్లు సమాచారం. తనకు.. ఈ రాజకీయాలు వద్దంటూ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో నచ్చినట్లు చేసుకోండని తనకు సంబంధం లేదని చెప్పిన బాలినేని.. హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి..YV సుబ్బారెడ్డి.. బ్రేకులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. బాలినేనితో జనసేన నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

మొత్తానికి చూస్తే.. బాలినేని తగ్గేదేలే అంటే.. హై కమాండ్ మాత్రం ఆప్షన్స్ తో మంతనాలు జరుపుతోంది. ఇక.. ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో జగన్ మనసులో ఏముందో.. లెక్క ఎప్పుడు తేలుతుందా అని ప్రకాశం జిల్లా ప్రజలు, వైసీపీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News