BigTV English

Bigtv Free Medical Camp: కనీసం రవాణా సదుపాయం కూడా లేని గ్రామంలో.. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు

Bigtv Free Medical Camp: కనీసం రవాణా సదుపాయం కూడా లేని గ్రామంలో.. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు

Bigtv Free Medical Camp: మీడియారంగం వ్యాపారధోరణిలో సాగుతున్న వేళ పేదలకు బాసటగా నిలుస్తోంది బిగ్‌టీవీ. ప్రారంభించిన అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుని.. తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకున్న బిగ్‌టీవీ.. పేదల అనారోగ్యంపై దృష్టి సారించింది. ఆయా కుటుంబాలకు అండగా ఉన్నామని చెప్పడమే కాకుండా.. జిల్లాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ.. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తోంది. అనితర సాధ్యమైన ఈ సేవా కార్యక్రమాలను ప్రజలతో పాటు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.


నిజం కావాలా.. భజన కావాలా అనే నినాదంతో మీడియారంగంలోకి ప్రవేశించిన బిగ్‌టీవీ.. తెలుగురాష్ట్రాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. నిఖార్సైన వార్తలను అద్భుతంగా ప్రజలకు అందించటంతో పాటు జనాలను చైతన్య పరుస్తూ పేదలపక్షంగా నిలుస్తోంది. సంపాదనే ధ్యేయంగా వ్యవస్థలు నడుస్తున్న సమయంలో బిగ్‌టీవీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే.. పేద ప్రజలు ఉన్న చోటే క్యాంపులు ఏర్పాటు చేసి.. వారి వద్దకే వెళ్లి.. పరీక్షలు చేయటం సహా అవరసమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తూ..పేదలకు భరోసా ఇస్తోంది బిగ్‌టీవీ.

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవి నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంప్‌లకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ ఆరోగ్య సమస్యలను చెప్పి.. డాక్టర్స్ దగ్గర నుంచి సరైన సలహాలతో పాటు ఉచితంగా మందులనూ తీసుకుని వెళ్తున్నారు. ఉచితంగా మెడికల్ క్యాంపులను నిర్వహించడంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలోనూ మెడికల్ క్యాంప్ లను పెట్టాలని ప్రజలు కోరుతున్నారంటే.. బిగ్ టివీ హెల్త్ క్యాంప్ ఎంతటి ఉపయోగకరంగా ఉందో అర్థమవుతుంది. ఉచితంగా టెస్టులు సరే ఆపరేషన్లు చేయించటం చాలా ఆనందంగా ఉందని రోగులు చెబుతున్నారు.


ఇక తాజాగా విజయం నగరం జిల్లాలో బిగ్ టీవి యాజమాన్యం మెడికల్ క్యాంపు నిర్వహించారు. విజయనగరం నుండి కురుపాం 120 కిలోమీటర్లు దూరం అక్కడి నుండి 30 కిలోమీటర్ల ఘాట్ రోడ్ లో ప్రయాణించి టి.కే జమ్మూ అనే మారుమూల గిరిజన గ్రామంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. జెమ్స్ హాస్పిటల్, రూట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం జిల్లా మన్యంలో బిగ్ టీవీ అడవుల వెంట నడిచి నడిచి డాక్టర్స్ ని, మందులు తీసుకుని వెళ్లి మెడికల్ క్యాంపు నిర్వాహణ అంత సులభం కాదు.. ప్రభుత్వాలు ఎన్నిమారినా మన్యం ప్రజలు కస్టాలు పడుతూనే వున్నారు. జ్వరాలు వచ్చిన ప్రభుత్వహాస్పిటల్ వారుకూడా మెడికల్ Camps నిర్వహించరు. కానీ మన బిగ్‌టీవీ విజయనగరం రిపోర్టర్ శివశంకర్‌ & అక్కడి లోకల్‌ రిపోర్టర్‌ ఈ మంచిపని చేశారు. చాలామందికి గిరిజనులకు సహాయం చేశారు.

Also Read: దోచుకో.. పంచుకో.. తినుకో.. అంతా మాఫియా మయం.. కూటమిపై జగన్ సెటైర్స్

మారుమూల ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో బిగ్‌టీవీ ఈ మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రిలో చెసే మెడికల్ టెస్టులు ఉచితంగా చేయటమే కాకుండా మందులను కూడా అందిస్తున్నందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెడికల్‌ క్యాంపు ఎక్కడో అని టీవీలో తెలుసుకుని..ఆయా ప్రాంతాల జనాలు అక్కడకు తరలి వస్తున్నారు. సొంతవాళ్లు కూడా పట్టించుకోని ఈ రోజుల్లో.. ఓ మీడియా సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటంపై ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇంకా ఈ క్యాంపుల సంఖ్య పెంచాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు.

తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంత వాసులకూ ఉచిత వైద్య సాయం అందించేలా బిగ్‌టీవీ పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతోంది. ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా.. ప్రజలకు మేమున్నామంటూ బిగ్‌ టీవీ భరోసా కల్పించటం.. ఓ రకంగా హాట్‌ టాపిక్‌గానే మారింది. ఎందుకంటే కార్పొరేట్‌ సోషల్ రెస్పాన్స్‌బులిటీ పేరుతో చాలా సంస్థలు చేయలేని పనిని. అత్యంత సులభతరంగా బిగ్‌టీవీ చేయటం.. తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలోనూ ఇంతకు ముందు.. ఇలాంటి కార్యక్రమాలను ఎవరూ చేయలేదని.. ఇది ఓ రకంగా స్ఫూర్తిదాయకమి పలువురు ప్రముఖులు కూడా అభినందలు చెబుతున్నారు. ఇంతకు ముందు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా టెస్టులు చేసిన సందర్భాలున్నాయని.. కానీ.. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లు చేయించటం ఇదే తొలిసారి అని.. అదీ.. ఓ మీడియా సంస్థ చేయటం సంతోషమని ప్రముఖులు చెబుతున్నారు.

మెగా హెల్త్ క్యాంపులకు సహకరిస్తున్న వారికి కూడా బిగ్ టీవి తరపున జనం కృతజ్ఞతలు చెబుతున్నారు. క్యాంపులపై వివరాలు తెలుసుకుంటున్న తెలుగురాష్ట్రాల్లోని రాజకీయనేతలు, ఎమ్మెల్యేలు… స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే .. బిగ్‌టీవీ సేవా ధృక్పదానికి నిదర్శనంగా చెప్పొచ్చు. సీజనల్‌ వ్యాధులతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులను పరీక్షల ద్వారా గుర్తించటం సహా అవసరమైన వారికి ఉచితంగా సేవా కార్యక్రమాలు చేయటం.. పేదలకు మందులు పంపిణీ చేయటంతో ఓ మీడియా సంస్థ చేస్తున్న కృషిపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే.. టీవీ ఛానల్స్ కూడా ఇలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని బిగ్ టీవీని ఆశీర్వదిస్తున్నారు. TRPలను బేఖాతరు చేస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. మెడికల్ క్యాంప్ లను నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×