E-Paper
Advertisement

Salman Khan : సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం… ‘బిగ్ బాస్ ‘ షూటింగ్ పరిస్థితి ఇదీ!!

Salman Khan : సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం… ‘బిగ్ బాస్ ‘ షూటింగ్ పరిస్థితి ఇదీ!!
Advertisement

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు హత్య బెదిరింపులు రావడంతో ఆయన చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇక ఆయన ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘సికిందర్’ షూటింగ్, మరోవైపు ఆయన హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ షూటింగ్ ఆగిపోయినట్టేనా? అనే అనుమానాలు నెలకొన్నాయి. మరి ఇంతటి బందోబస్తు మధ్య సల్మాన్ ఖాన్ షూటింగ్ ఎలా చేస్తున్నారు? అసలు బిగ్ బాస్ పరిస్థితి ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

‘బిగ్ బాస్’ షూటింగ్ ఇలా.. 

Advertisement

సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) నుంచి వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా 5 కోట్లు ఇస్తే వీటికి ఫుల్ స్టాప్ పెడతామని మరోసారి బెదిరింపులు రావడంతో ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ‘బిగ్ బాస్’ షో హోస్టింగ్ కు దూరంగా ఉంటారని రూమర్లు కూడా బయలుదేరాయి. కానీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిగ్ బాస్ షూటింగ్ పూర్తి చేస్తున్నట్టు తాజా సమాచారం. ఆయన కట్టుదిట్టమైన భద్రత నడుమ ‘బిగ్ బాస్ 18’ (Bigg Boss 18) షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి సెట్ లోకి అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్ తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హౌస్ లో బస చేశారని, అంతేకాకుండా ‘వీకెండ్ కా వార్’ అనే ఎపిసోడ్ ను అక్కడ షూట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. సెట్ లో సల్మాన్ ఖాన్ చుట్టూ దాదాపు 60 మంది సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, నిరంతరం వాళ్లు సల్మాన్ ఖాన్ తో పాటు సెట్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సెట్ లోకి బయట వారికి ఎవరికీ అనుమతి లేదట. సిబ్బంది సైతం ఆధార్ కార్డు చూపిస్తేనే అక్కడ అడుగు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా బిగ్ బాస్ షూట్ పూర్తయ్యే వరకు సెట్ నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లేందుకు ఛాన్స్ లేదట. సెట్ లో ఉండే అతి కొద్ది మంది సిబ్బంది దగ్గర కూడా ఫోన్లో ఉండకుండా చూసుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షూటింగ్ అయితే చేస్తున్నారు.

‘సికిందర్’ సంగతేంటి?

Advertisement

ఇదిలా ఉండగా సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘సికిందర్’ (Sikandar) షూటింగ్ ఆగుతుందా ?లేదంటే ఇలాంటి భద్రత నడుమే కంప్లీట్ అవుతుందా? అనేది చూడాలి. ఈ ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పుల కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి సల్మాన్ ఖాన్ కు భద్రతను టైట్ చేసింది. ఇక రీసెంట్ గా సల్మాన్ స్నేహితుడు, ఎన్సిపి నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురవ్వడంతో సల్మాన్ కు మరింత భద్రతను పెంచారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×