Big Stories

Anantapur : పింఛన్ తొలగింపు.. అంధురాలి ఆత్మహత్య..

Anantapur : అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కనదొడ్డి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరోజ (40) అనే అంధు మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. సరోజ కి తల్లి, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు కుళ్లాయి స్వామి నాయక్ కి రైల్వే ఉద్యోగం వచ్చింది. ముగ్గురి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నాయి. దాంతో సరోజకి సంవత్సరము నుంచి పింఛన్ రావడంలేదు.

- Advertisement -

సచివాలయం సిబ్బందికి చాలా సార్లు పింఛన్ రావడంలేదని చెప్పింది. అయినా సచివాలయం సిబ్బంది పట్టించుకోలేదని వాళ్లతో గొడవ పడింది. తల్లి దగ్గర ఈ విషయంపై చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేసింది. సరోజకు రెండు కళ్లు లేవని, కళ్లు కనిపించని ఆమెకు సంవత్సరము నుంచి పింఛన్ రాకపోవటంతో మనస్థాపానికి గురైంది. ఇక రాదు అని నిర్ణయించుకుంది.

- Advertisement -

తల్లి లక్ష్మీదేవి శుభకార్యానికి వేరే ఊరికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో సరోజ ఆత్మహత్య చేసుకుంది. సరోజ తల్లి లక్ష్మీదేవి ఇంటికి వచ్చి చూడగా సరోజ కింద పడి ఉంది.ఆమె కుటుంబ సభ్యులు ఆమెని హటాహుటిన గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. లక్ష్మీదేవి తన కూతురు మృతి పట్ల కన్నీరు మున్నీరు అయ్యంది . ఒక్కసారిగా గ్రామస్తులు.. బంధువులు ఈ విషాద ఘటన పట్ల చలించి పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News