E-Paper
Advertisement

Indian Navy Day Celebrations : ఆర్కే బీచ్ లో నౌకాదళం విన్యాసాలు.. విశాఖలో కోలాహలం..

Indian Navy Day Celebrations : ఆర్కే బీచ్ లో నౌకాదళం విన్యాసాలు..  విశాఖలో కోలాహలం..
Advertisement

Indian Navy Day Celebrations : భారత నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. 1971లో పాకిస్తాన్‌‌తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా… ప్రతీ ఏటా డిసెంబర్ 4వ తేదీన.. విశాఖలో నేవీ డే పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో కూడా డిసెంబర్ 4న విశాఖ ఆర్కే బీచ్ వద్ద నేవీ విన్యాసాలు చేసేందుకు ప్లాన్ చేయగా… తుపాన్ కారణంగా కార్యక్రమం రద్దు చేశారు.

ఇక నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ఇప్పటికే దీని కోసం మూడు రోజులుగా రిహార్సల్ ను పూర్తి చేశారు. యుద్ద నౌకలతో పాటుగా, హెలీకాప్టర్ లు, యుద్ద విమానాలు కలసి ఈ విన్యాసాలలో పాల్గోన్నాయి. మెరైన్ కమాండోస్ విన్యాసాలు, శత్రు స్థావరాలను వాయు మార్గంలో వచ్చి మట్టు పెట్టడం, వంటి అద్భుత విన్యాసాలను ప్రదర్శించనున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈరోజు యుద్ధ నౌకలు, గగనతల విమానాల విన్యాసాలు, నావికుల సాహస క్రీడలు చూసేందుకు విశాఖ తీరం ముస్తాబైంది. విశాఖ ఈస్టర్న్ నావల్ కమాండ్ ఏర్పాటు చేసే నేవీ బ్యాండ్, విద్యార్థులు చేసే ప్రత్యేక నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఇక విశాఖలో జరిగి నేవీ డేపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు.

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×